బాలుడు హత్యోదంతం పాశవికం: సీఎం ఖట్టర్‌

Khattar 1
Manoharlal Khattar

చండీగఢ్‌: గురుగ్రామ్‌లో పాఠశాలలో ప్రథ్యుమన ఠాకూర్‌ బాలుడి దారుణ హత్యపై హరియాణ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుశ్చర్య. నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖట్టర్‌ అన్నారు.ర ఘటనపై
విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా దీనిపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని
సంబంధిత అధికారులను ఆదేశించాం. నివేదిక వచ్చిన తర్వాత అందులో స్పష్టత లేకపోతే ఎలాంటి విచారణ చేపట్టేందుకైనా
సిద్ధంగా ఉన్నాం అని ఖట్టర్‌ తెలిపారు. రేయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ రెండో తరగతి చదువుతున్న బాలుడు పాఠశాల
టాయిలెట్‌ వద్ద రక్తపమడుగులో కన్పించిన విషయం తెలిసిందే. బస్‌ కండక్టర్‌లో ఒకరైన అశోక్‌ కుమార్‌ ఈ దారుణానికి
పాశవిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన అశోక్‌, అది సాధ్యం
కాకపోవడంతో అతడిని దారుణంగా హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.