బాలుడిపై లైంగిక‌దాడి

BREAKING NEWS
BREAKING NEWS

సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. రామచంద్రాపురం మైనారిటీ గురుకుల విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై పాఠశాల సిబ్బందిలో ఒకరు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలుడి బంధువులు ఆరోపించారు. అనుమానం ఉన్న పాఠశాల సిబ్బందిపై దాడి చేశారు. 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మలద్వారం నుంచి రక్తస్రావం జరుగుతుందని పాఠశాల సిబ్బంది బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వారు బాలుడిని గట్టిగా అడగడంతో తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పాడు. దీంతో బంధువులు స్కూలు సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.