బాలికపై ప్రమోన్మాది ఉన్మాదం

B N
B N

హైదరాబాద్‌: నగరంలో మరో ప్రమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదనే నెపంతో మైనర్‌ బాలికపై కిరోసిన్‌ పోసి నిప్పటించిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. అంబర్‌పేట ఠాణా పరిధిలో గంగానగర్‌ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికుల సమాచారం.