బాలకృష్ణ సంచలన నిర్ణయం!

హిందూపురం: నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో నివాసం ఉండగా ఖైరతాబాద్ సెగ్మెంట్లో ఓటు హక్కు ఉంది. అయితే గత శాసన సభ ఎన్నికల్లో హిందూపురం నుండి ఎమ్మెల్యెగా పోటిచేసి గెలుపొందారు. కాగా బాలకృష్ట ఓటు హక్కు తెలంగాణలో ఉండడంవల్ల ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో బాలయ్య ఓటు హక్కుపై రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చాయి. అయితే ఈవిమర్శలకు చెక్పెడుతు బాలకృష్ణ హైదరాబాద్లో ఓటరు జాబితాలో తొలంగిపుచేసుకన్నట్లు, హిందూపురంలో ఓటరుగా నమోదు చేయించుకనేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.