బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు ఫైర్‌ నిబంధనలు పాటించాల్సిందే

bontu rammohan
bontu rammohan

ఆగస్టు 30 డెడ్‌లైన్‌ అనుమతులు తీసుకోవాలి
హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఉన్న బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు ఖచ్చితంగా ఫైర్‌ నిబంధనలు పాటించాల్సిందేనని మేయర్‌ బొంతు రాంమోహన్‌ స్పష్టం చేశారు. సోమవారం జిహెచ్‌ఎంసి కార్యాలయంలో బార్లు, పబ్‌లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో మేయర్‌ బొంతు రాంమోహన్‌, కమిషనర్‌ డా.బి.జనార్థన్‌రెడ్డి, విజిలెన్స్‌ డైరక్టర్‌ విశ్వజిత్‌ కంపాటిలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఫైర్‌ సేఫ్టీ ధృవీకరణ పత్రాన్ని డైరక్టర్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి పొందాలని, మరిన్ని వివరాలు జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫైర్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఫైర్‌ ఎక్వివ్‌మెంట్‌ 1000 మీటర్లకు రూ.30000-50000 ఖర్చు అవుతుందన్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 30వ తేది నాటికి అనుమతులు పొందాలన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ డైరక్టర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో సూచించారు. గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బార్‌, పబ్‌, రెస్టారెంట్ల నిర్వాహకులకు సూచించారు.