బార్య‌ను క‌డ‌తేర్చి.. భ‌ర్త బ‌లన్మ‌ర‌ణం

Hang Suicide Judge
Suicide

కరీంనగర్: అనారోగ్య కారణాలతో క్షణికావేశానికి లోనై కట్టుకున్న భార్యను గొంతుకొసి, భయంతో భర్త బ‌లన్మ‌ర‌ణం చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన అనవేని నర్సయ్య (55) కొంతకాలంగా హైబీపీతో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా భార్య కొమురమ్మతో గొడవపడుతున్నాడు. శనివారం రాత్రి కొమురమ్మ పడుకున్న తర్వాత కత్తితో గొంతు కోశాడు. అరుపులు విని, స్థానికులు అప్రమత్తమై కొడుకులకు సమాచారం అందించడంతోపాటు ఆమెను హుటాహుటిన దవాఖానకు తరలించారు. కాగా, భయంతో నర్సయ్య ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన కొడుకులు నర్సయ్య మృతి చెంది ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మాధవరావు కేసు నమోదు చేసి, దవాఖానలో చికిత్స పొందుతున్న కొమురవ్వ వద్ద న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం సేకరించారు.