బాబు దీక్షకు మద్దుతు తెలిపిన మాజీ సిఎం

Farooq Abdullah, chandrababu
Farooq Abdullah, chandrababu

న్యూఢిల్లీ: సిఎం చంద్రబాబు ఏపికి ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. దీనికి జమ్ముకాశ్మీర్‌ మాజీ సిఎం ఫరూక్‌ అబ్దుల్లా మద్దుతు తెలిపారు. ఈసందర్భంగా ఫరూక్‌ మాట్లాడుతు పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఉద్ఘాటించారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుందని, అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడికి వరకు వచ్చారన్నారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలన్నారు. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదని హితవు పలికారు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.