బాబు అనుమతితోనే కూటమిలో నిర్ణయాలు

B NARSAIAH GOUD
B NARSAIAH GOUD

రంగారెడ్డి: చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా కూటమిలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడిందని టిఆర్‌ఎస్‌ ఎంపి బూర నర్సయ్యగౌడ్‌ సానుభూతి వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎంత పెద్ద మేధావో కాంగ్రెస్‌లోని నేతలకు అంతుపట్టడంలేదని అన్నారు. ఇబ్రహింపట్నంలో రైతుల సమ్మేళనానికి హాజరైన ఎంపి మాట్లాడుతూ..కోటి ఎకరాలకు నీళ్లివ్వడమే కేసిఆర్‌ లక్ష్యమని, కాని చంద్రబాబు అడుగడుగునా ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పండ్ల మార్కెట్‌ వస్తుందని ఎంపి వెల్లడించారు.