బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు

chandra babu, ap cm
chandra babu, ap cm

అమరావతి:  ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపునకు, ఐటీ ప్రోత్సాహకాల చెల్లింపునకు, ట్రాక్టర్లు, ఆటోలకు జీవితకాలం పన్ను మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కేబినెట్ లో చర్చించారు. రాజధానిలో జర్నలిస్ట్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే, సీఆర్డీఏ చట్టంలో నిబంధనలు పొందుపర్చాక వచ్చే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.