బాబాయే ఆలస్యం…

VENKI, RANA
VENKI, RANA

 బాబాయే ఆలస్యం…

ఇటీవల తమిళంలో మంచి విజయం సాధించిన ‘విక్రమ్‌ వేద చిత్రంలో మాధవన్‌, విజ§్‌ుసేతుపతిలు నటిచంఆరు.. ఈచిత్రం తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, రానాలు నటిస్తారని ప్రచారం జరిగిన విషయం విదితమే.. ఇక ఈచిత్రం వెంకీ నో అనటంతో నాగార్జున వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది.. దీంతో తమ అభిమాన వెంకీ-రానాలను ఒకేసారి తెరపై చూడాలనుకున్న దగ్గుబాటి ఫ్యాన్స్‌కి కాస్త నిరుత్సాహం ఏర్పడింది.. అయితే ఈ కాంబో మరో రూపంలో రూపుదాల్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి
రుద్రమదేవితో మంచి పేరు తెచ్చుకున్నా కూడ స్వీయ నిర్మాణం కారణంగా, ఓవర్‌ బడ్జెట్‌ కారణంగా ఈచిత్రం ఆశించిన లాభాలను సాధించలేకపోయింది.. దీంతో గుణశేఖర్‌ తన తదుపరి చిత్రాన్ని హిరణ్యకస్యప పేరుతో హిరణ్యకస్యపుని కోణంలో జరిగే కథగా తెరకెక్కించాలని భావిస్తున్న గుణశేఖర్‌ ఈచిత్రం టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించారు.. కాగా చిత్రంలో ముఖ్యపాత్రకు రానాను సంప్రదించగా, ఆయన అంగీకారం తెలిపినట్టు , ఆయన తదుపరి చిత్రం ఇదేనని ప్రచారం జరుగుతోంది.. ఈచిత్రాన్ని రూ.100 కోట్లతో తెరకెక్కించాలనేది గుణశేఖర్‌ లక్ష్యంగా ఉందని చెబుతున్నారు.. అందుకు అనుగుణంగానే ఆయన ఈచిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ భాషల్లో రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.. తెలుగులో మరింత క్రేజ్‌ తెచ్చేందుకు ఇందులోని ఓ కీలకపాత్రను బాబా§్‌ు వెంకటేష్‌ని గుణశేఖర్‌ అడిగారట, దాంతో కథ వినప్నాక వెంకీ తన నిర్ణయాన్ని త్వరలోనే తెలుపుతానని వెంకీ చెప్పినట్టు సమాచారం.