బాబర్‌ క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌: బాబర్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు పాకిస్థాన్‌ ఆర్మీ తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి… 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని పేర్కొన్నది. ఇది గత 3వారాల్లో పాక్‌ నిర్వహించిన మూడో క్షిపణి పరీక్ష కావడం గమనార్హం.