బాన్సువాడకు కెసిఆర్‌ హామీలు

kcr
kcr

బాన్సువాడ: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాం సాగర్‌ ప్రాజెక్టు నిండా 365 రోజులు నీళ్లు ఉంటాయని కెసిఆర్‌ స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్‌ పాల్గొని ప్రసంగించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలని కెసిఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాంసాగర్ 365 రోజులు నిండే ఉంటది. వర్షం పడ్డ, పడకపోయినా నాట్లు వేస్తూనే ఉంటాం. మే నెల(రోహిణి కార్తె)లో నార్లు పోయాలి. రెండో పంట మార్చిలోనే కోయాలి. అప్పుడే బంగారు తెలంగాణ తయారవుతది. సింగూర్ నుంచి నీళ్లు ఇవ్వాలని కొట్లాడిండు పోచారం. ఇప్పుడు నిజాం సాగర్ నిండా నీళ్లు ఉన్నాయి. బాన్సువాడను పచ్చతోరణంలా తయారు చేస్తాం. చందూర్, మోస్తరను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని, బాన్సువాడకు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నాను. పోచారంను గెలిపించుకుంటే బాన్సువాడ మరింత అభివృద్ధి చెందుతోంది అని కెసిఆర్‌ స్పష్టం చేశారు.