బాధితురాలి పేరును వెల్లడి చేసిన మీడియాపై కోర్టు ఫైర్‌

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీ: కథువా అత్యాచార కేసులో బాధితురాలి పేరును వెల్లడించిన మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు ఫైర్‌ అయింది. ఆమె పేరును వెల్లడించిన మీడియా సంస్థలన్నీ రూ.10లక్షల చోప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మెత్తాన్ని బాధితురాలి కుటుంబానికి అందేలా పరిహారం నిధిలో జమచేయాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. ఇకపై అత్యాచారం కేసులో బాధితుల పేర్లను వెల్లడిస్తే 6నెలల పాటు జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. జమ్మూకశ్మీర్‌ఓ కథువా జిల్లాలో మైనర్‌ బాలిక(8) కొందరు మానవ మృగాలు అత్యాచారం చేసి, ఆపై దారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనపై బాధితురాలి పేరును కూడా పలు మీడియా సంస్థలు వెల్లడించడంతో హైకోర్టు ఈ నెల 13న ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇకపై బాధితురాలికి చెందిన ఎలాంటి గుర్తింపు బయటికి పొక్కకుండా చూడాలని ఆదేశించింది.