బాగ్స్‌..బాగ్స్‌..

                                                 బాగ్స్‌..బాగ్స్‌..

bags
bags

”అమ్మా! ఈ ఏడాదన్నా కొత్త స్కూల్‌ బ్యాగ్‌ కొంటావా, లేదా? అని అనంత కొడుకు సమంత్‌. ”ఆ పాతదాంతోనే గడిపేయమనవ్ఞ కదా? అందరూ కొత్తబాగ్స్‌తో వస్తే మేం ఈ పాత బ్యాగ్స్‌తో వెళితే అంతా మమ్మల్నే చూస్తారు అని కూతురు మధురిమ తల్లి భుజాలు పట్టి ఊపసాగారు. అనంత తల తిరిగిపోసాగింది. అటు రెట్టింపుగా పెరుగుతున్న మరిది ఇంజనీరింగ్‌ ఫీజ్‌, ఇటు ఆడపడుచు పెళ్లి. ఎదుట పిల్లల కోరికలో, అవస రాలో, వీటికి తోడు, పెరుగుతున్న అవసరాలతో పోటీగా పెరుగుతున్న ధరలు, మెప్పేట ఉచ్చులో మధ్యతరగతి బాధ్యతలు మోసే మహిళలకు ప్రతినిధిగా అనంత. ఎటు చూస్తున్నా పెరగటం తమ ఒరుంబడి మాత్రం ఖర్చులకు తగ్గట్లు పెరగటం లేదు. మండే ఎండలు, అంతకన్నా మండే పెట్రోల్‌ ధరలు, దాంతో మరీ మండిపోతున్న నోట్సులు, తెల్లకాగితాల పుస్తకాలు, ఒకటేంటి అన్నీ ఎండలతో పోటీపడి మండిపోతుండగా బడులు తెరుస్తు న్నారు. ఏవెంత ఖరీదైనా కార్పొరేట్‌ స్కూళ్లల్లో చదివించే స్థోమతున్న వారికి ఫరవాలేదు కానీ మధ్యతరగతి, క్రింది మధ్య తరగతి వారి కుటుంబ యజమానుల గుండెల్లో రైళ్ల పరుగెత్తే రోజులివి. తెల్లకార్డులున్న వారికి ప్రభుత్వం ఎటూ అన్ని చవగ్గానో, ఉచితంగానో ఇస్తుంది. అన్నింటికీ బలయ్యేది మధ్యతరగతివారే!

మధ్యతరగతిలోని అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ వారు కాస్త బయటపడనూ మొహమాటపడతారు, కవర్‌ చేసుకోను యత్నిస్తుంటారు. మధ్య తరగతి వారు సర్దుబాటు చేసుకోను, పొదుపు చేయనూ, మరోమార్గం వెతుక్కోనూ చూస్తుండగా క్రింది మధ్యతరగతి వారు నీళ్ల నుంచి బయటపడ్డ చేపలా, కుడితిలో పడ్డ ఎలకలా ఏమీ చేయలేక, పరిస్థితులను ఎదిరించలేక ఊగిసలాడుతుంటారు. అప్రయత్నంలోనే తమ పిల్లలకు సరైన చదువ్ఞలు అందించడంలో కూడా వెనకపడిపోతుంటారు. ఫెయిలై పోతుంటారు. అప్పుడే కుటుంబాల్లో ఘర్షణలు, వ్యధలూ మొదలౌతుంటాయి. అవసరానికి ఒక్క శాతం సొమ్ము ఎప్పుడూ వారికి తక్కువౌతుంటుంది. మధ్యమధ్య తరగతి వారికి అవసరానికి సరిపడా మాత్రమే ఉంటుండగా, హయ్యర్‌ మిడిల్‌ క్లాస్‌ వారి అవసరానికి ఒక్కశాతం సొమ్ము ఎక్కువగా ఉంటుంది. ఈ తేడాలు నిరం తరం ఉంటూనే ఉంటుండటం వల్ల వారి జీవితాలు కొంతవరకూ అదోలా నడుస్తుండగా మరికొందరివి అస్తవ్యస్తమవ్ఞతున్నాయి.ఆధారం అందితే పైకెగ బాక గల తెలివితేటలున్న వారైనా అవకాశాలు లేక మొగ్గల్లోనే ముకుళించి పోతున్నారు. స్కూల్‌ యూనిఫాంలు కొనాలన్నా, తెల్లకాయితాల పుస్తకాలు, నోట్సులూ, పెన్స్‌, పెన్సిల్స్‌, స్కూల్‌బ్యాగ్స్‌ అన్నీ భారమే వారికి.

ప్రభుత్వ విధానాల వల్ల నష్టపడేది ఈ మధ్య తరగతి వర్గమే. ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోతలా బ్రతుకుతుంటారు. గృహిణులు విషయం ఆలోచిస్తే పాపం అన్నివిధాలా బాధలూ, ఇబ్బందులూ పడేది వీరే. సమాజంలో ఇతర తరగతి వారిని చూసి అలా ఉండాలని అటు పిల్లలూ ఇటు పెద్దలూ అనుకుంటున్నా అందుకోలేని స్థితి వారికి. ఉట్టికి,స్వర్గానికి కాని బ్రతుకులు. స్కూళ్లు తెరిచేపర్వం వారి పాలిట అరణ్యపర్వమే అవ్ఞతుంటుంది. ప్రతి క్వార్టరుకు కట్టవలసిన ఫీజులూ, కొనవలసిన వస్తువ్ఞలూ వారికి సవాల్‌ అవ్ఞతుంటాయి. పిల్లలు సహజంగా పాతవాటితో సర్దుకోనూ లేరు, పెద్దలు కొత్తవి కొననూ లేరు. దీంతో గృహిణికి, గృహస్తుకూ మధ్య పెద్ద రణరంగం. ఇది ఈనాటి మన మధ్య తరగతి వారి స్థితి. ఈ బళ్లు తీసే రోజులు నిజానికి వారికి పరీక్షా సమయాలే మరి! కొత్త తరగతుల్లోకి కొత్తకొత్త బూట్లు, సంచులు, నోటు, అచ్చు పుస్తకాలతో వెళ్లాలని పిల్లల్ని కోరు కోవడం సహజమే. అది మధ్యతరగతి గృహిణుల పాలిట ఎంసెట్‌ పరీక్షలాంటిది. ప్రతి తరగతీ పిల్లలు దాటుతుంటే సంతోషంతో పాటుగా, ఖర్చులు భరించే ధైర్యం లేక గుండెబలం తగ్గిపోతుంటుంది. అయ్యో మళ్లీ బడులు తెరిచే రోజులొచ్చాయే! అని భయపడటంలో వింతే ముందీ!