బాండ్ల మార్కెట్లలో తగ్గిన రిటర్నులు

DOLLAR
ముంబై : ప్రపంచంలోని మొత్తం బాండ్ల మార్కెట్‌లో మూడో వంతు అంటే 13 లక్షల కోట్ల డాలర్ల బాండ్లకు ప్రతికూల రిటర్నులు వచ్చాయి. అంటేరాబడులు పూర్తిగా తగ్గినట్లు తేలింది. బ్రెగ్జిట్‌ అనంతర ప్రభావాలతో ఈక్విటీ మార్కెట్లు ఒడిదు డుకులకు లోనవుతున్నందున ఇన్వెస్టర్లు బాండ్లు, బంగారం వెండిరంగాలపై పెట్టుబడులు పెంచారు. అయితే ఆయాదేశాల్లో సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంతో బాండ్లపై వచ్చేవడ్డీ రాబడులు కూడా తగ్గాయి. మొత్తంప్రపంచ దేశాల బాండ్ల మార్కెట్‌లో ఎక్కువ శాతం డెట్‌రంగంనుంచే ఉన్నాయి. వీటికి ఇటీవలి కాలంలో డిమాండ్‌పెరిగింది. బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగాలన్న నిర్ణయం తర్వాత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత మార్గాల్లో అంటే బాండ్లు, బంగారం వెండిమార్కెట్లకు బదలాయించారు. పదేళ్ల అమెరికా ట్రెజరీరాబడులు ఆల్‌టైమ్‌ దిగువకు అంటే 1.34శాతం దిగజారాయి. 30 ఏళ్ల బాండ్లు 2.15 శాతం క్షీణించాయి. బ్రిటన్‌లో పదేళ్ల బాండ్లరాబడులు ఒక పర్సంటేజి పాయింట్‌కు క్షీణించింది. 0.77 శాతంగా ఉంది. జపాన్‌లోచూస్తే 90శాతం సావరి న్‌ డెట్‌ ట్రేడింగ్‌ ప్రతికూల ఫలితాలిస్తోంది. ఇక స్విట్జర్లాండ్‌లో 50 ఏళ్ల బాండ్ల రిటర్నులు కూడా భారీగా తగ్గాయి. అయితే ప్రతికూల వడ్డీరేట్లకు సం బంధించిన పూర్తి పరిస్థితులపై మరింత స్పష్టత రావాలని ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్ల డించారు. మంచికంటే చెడు ఎక్కువ జరుగుతు న్నదా అన్న అంశంపై సెంట్రల్‌బ్యాంకులు ఆలోచిం చాలన్నారు. అదేభారత్‌లో అయితే ఇతర దేశాల నుంచి నిధులు అందుతున్నందున ప్రనతికూల వడ్డీరేట్లు కూడా వర్ధమానమార్కెట్లకు పెట్టుబడుల ను బదలాయిస్తాయి. భారత్‌లాంటిదేశాలకు మరిం త ఎక్కువ పెట్టుబడులు అందుతాయని తేలింది. అయితే వీటివల్ల కరెన్సీ, ఈక్విటీ మార్కెట్లలో భారీ అనిశ్చితి ఎదురవుతుంది. ప్రతికూల వడ్డీరేట్లు అంటే పాశ్చాత్యదేశాల్లోని బ్యాంకులు తమ వృద్ధికోసం రుణాలు తీసుకోమని ప్రోత్సహిస్తుంటాయి. ఆర్థిక వేత్తల అంచనాలప్రకారం చూస్తే ప్రతికూల వడ్డీ రేట్లతో ఉన్నఆర్ధికవ్యవస్థలున్న దేశాలు ఒక అనుకోని స్థితికి చేరాయన్నారు. తమ దేశంలో పెట్టుబడులు, ఈక్విటీ ఇన్‌ఫ్రా వనరులు వృద్ధిరంగాలంటే ఇలాంటి పద్ధతులకు వస్తాయి. ప్రస్తుతం జపాన్‌ ప్రతికూల వడ్డీరేట్లనే అమలుచేస్తోంది. ప్రస్తుతం ప్రతికూల వడ్డీరేట్ల ప్రభావం స్విట్జర్లాండ్‌, జర్మనీ,ఫ్రాన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, బెల్జియం, స్వీడన్‌, ఫిన్‌ ల్యాండ్‌ డెన్మార్క్‌లలో ఉంది. ఇటలీ స్పెయిన్‌లలో స్వల్పంగా ఉంది. బ్రిటన్‌,అమెరికా దేశాల్లో మాత్రం ప్రతికూల వడ్డీరేట్లులేవు. ఏడేళ్ల కాలపరిమితి ఉన్న బాండ్లకు ఎక్కువప్రతికూల పరిస్థితులు ఈదేశాల్లో నెలకొంటున్నాయి. అలాగే పదేళ్లకాల పరిమితి బాండ్ల కు మాత్రం తక్కువ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి.