బాండ్లపై హామీకోసం కేంద్రం ‘బడ్జెట్ గ్యారంటీఫండ్’కు కసరత్తు
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో గతఏడాది ప్రతిపాదించిన జాతీయ మౌలికవనరులనిధి తరహాలోనే ఈ ఏడాది బడ్జెట్లో బాండ్ గారంటీ ఫండ్ ఆఫ్ ఇండియా (బిజిఎఫ్ఐ)ను ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదిస్తోంది. బాండ్ మార్కెట్, ఇన్ఫ్రా సంస్థల్లో నెలకొన్న మందగమనాన్ని పారద్రోలేందుకు ప్రభుత్వ పరంగా ఇతోధిక ప్రోత్సాహం కల్పించాలని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో ఈ కొత్త అంశం ప్రతి పాదిస్తున్నారు. ప్రాథమికంగా రూ.5వేల నుంచి రూ.10 వేల కోట్ల వరకూ కార్పస్ నిధిని ఏర్పాటుచేసి బిజిఎఫ్ఐను ప్రారంభిస్తారు. ప్రభుత్వం 49శాతం వాటా కలిగి ఉంటుంది. ఎక్కువగా ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం కల్పించేందుకుగాను బిజిఎఫ్ఐ లో ప్రైవేటు సంస్థలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు ఆసియా అభివృద్ధిబ్యాంకు వంటిప్రభుత్వరంగ సంస్థలకు కూడా అవకాశం ఉంది. బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదిస్తున్న బిజిఎఫ్ఐలో అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా సేకరించాలని నిర్ణయించారు. తక్కువ రేటింగ్ ఉన్న స్కీంలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ విధివిధానాల కారణంగా బాండ్ల ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. డబుల్ ఏరేటింగ్ కంటే తక్కువస్థాయి లోనే ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఉండటమే ఇందుకు కారణం. ప్రాథ మిక స్థాయిలో ఈ రేటింగ్ వల్ల ఇన్వెస్టర్లు బాండ్ల మార్కెట్‌కు రావడంలేదు. ఈవిధానం నుంచి బైటపడేందుకుగాను ఆసియా అభివృద్ధి బ్యాంకు బాండ్ గ్యారంటీఫండ్ను ప్రతిపాదించింది. వివిధ సంస్థలు జారీచేసే దీర్ఘకాలిక బాండ్లకు గ్యారటీ ఇవ్వడమే ఈనిధి లక్ష్యం. డబుల్ ఏ రేటిం గ్ను మరింత మెరుగుపరిచి జాతీయ మౌలిక వనరుల నిధి తరహాలోనే బిజిఎఫ్ఐను కూడా వృద్ధి చేయాలని నిర్ణయించారు. ఎన్ఐఐఎఫ్ను రూ.40 వేలకోట్ల రూపాయల కార్పస్నిధితో ప్రారంభిం చారు. వాణిజ్యపరంగా గిట్టుబాటయ్యే ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు రగీన్ఫీల్డ్ అండ్బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులు, స్తంభించిన ప్రాజెక్టులను కూడా వృద్ధి చేసే లక్ష్యంతో ఈనిధిని ఏర్పాటుచేసారు. ఇన్ఫ్రా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినమోడీ ప్రభు త్వం ఆర్థికవృద్దిని పెంచుకునేదిశగా పలు సంస్క రణలు ప్రవేశపెట్టింది. మౌలికవనరుల పెట్టుబడుల పరంగా భారత్‌కు 67 లక్షల కోట్ల రూపాయలు అవ సరం అవుతాయని రానున్న ఐదేళ్లలో ఈ గ్యాప్ భర్తీ చేసు కోవాల్సి ఉందని ముందు నుంచీ మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 2017 మార్చినాటికి ఈ నిధులు 12 లక్షల కోట్ల లోటు ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్ఎల్) అంచనాల ప్రకారం కొన్ని రంగాలకు సంబంధించి ఆస్తి అప్పుల పట్టీలు సమతుల్యం కాకపోవడం, రుణపరపతి రికార్డులు నీరసించడం వంటి వాటికారణంగా దేశీయ బాండ్ మార్కెట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అంచనా వేసింది. ఐఐఎఫ్సిఎల్ రుణపరపతిని అందిస్తున్నప్పటికీ ఆర్బిఐ బ్యాంకులకు స్పష్టమైన మార్గ దర్శకాలు జారీచేసినా బిజిఎఫ్ఐ లాంటి సంస్థను ప్రోత్స హించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖప్రకటించింది. ఐఐఎఫ్సిఎల్ బాండ్ మొత్తంలో 50శాతం గ్యారంటీ ఇస్తుంది. బ్యాంకులు 20శాతం గ్యారంటీ ఇస్తాయి. డబుల్ఏ రేటింగ్ సాధించాలంటే ఎక్కువ మౌలికవనరుల రంగ ప్రాజెక్టులు 20శాతం రుణపరపతికి మించి అందుకోలేకపోతున్నాయి. ట్రిపుల్ ఏరేటింగ్రావాలంటే ఈ రంగంలోని ప్రాజె క్టులకు నూరు శాతం పరపతి అవసరం అవుతుంది. సంస్థాగత ఇన్వెస్టర్ల కు ఈ విధానం మరింత తప్పనిసరి అవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు సీనియర్ ఆర్థిక నిపుణులు డాన్ లాంబర్ట్ వెల్లడించారు. బాండ్లపరంగా ఇన్ఫ్రా రంగాన్ని మరింత పటిష్టపరచాలంటే ప్రభుత్వపరంగా జారీచేసే బాండ్లకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉన్నందున ప్రభుత్వం ఈదిశగా వ్యూహరచన చేసి బడ్జెట్లో కొత్త బాండ్ గ్యారంటీ ఫండ్ ఆఫ్ఇండియా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2016-17 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఈ సంస్థను ప్రతిపాదిస్తారని తెలుస్తోంది.