బహుళ అంతస్తులకేది నిబంధన?

breaking news
breaking news

హైదరాబాద్‌ : నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న భవనాల సంఖ్య క్రమేణా పెరిగిపోతుంది. కనీసం సెట్‌బ్యాక్‌ లేకుండానే అక్రమంగా అదనపు అంతస్తులను నిర్మిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇటీవల అక్రమ కట్టడాల నిర్మాణం జోరందుకుంది. నిర్మాణ అనుమతుల సంగెతెలా ఉన్నా ఇష్టారీతిగా అక్రమ అంతస్తులు వెలుస్తున్నాయి. ప్రధాన మార్గాలు, అంతర్గత రోడ్లు అనే తేడా లేకుండా అక్రమ కట్టడాలను యథేచ్చగా నిర్మించేస్తున్నారు. ఈ తరహలోనే సర్కిల్‌ 15 పరిధిలోని లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ మార్గంలో ఎలాంటి సెట్‌బ్యాక్‌లు వదలకుండా ఓ బహుళ అంతస్తును నిర్మిస్తున్నారు. ఇండియాబుల్‌ అపార్ట్‌మెట్‌కు వెళ్లి మార్గంలో జిప్లస్‌4 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనానికి సరైన అనుమతులు లేవని తెలుస్తుంది. చుట్టు కనీసం 3 ఫీట్లు సైతం వదలకుండా నాలుగు అంతస్తుల్లో నిర్మాణం చకచకా సాగుతుంది. ఇదే విధంగా ప్రత్యేక ఎన్‌పోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటికి గ్రేటర్‌ పరిధిలోని పలు సర్కిళ్లలో అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.