బహుమతులు, అభిరుచులు

COUPLE
COUPLE

బహుమతులు, అభిరుచులు

ఒకవిధంగా పిల్లల్లో సృజనాత్మకత వారు వాడే బొమ్మల్ని బట్టి వస్తుంది. అందుకే పిల్లలకిచ్చే బహుమతుల వల్ల వారిలో ఆసక్తి అభిరుచి పెరుగుతాయి అని మనం గ్రహించవచ్చు. అంతేకాదు వారికి సంగీతంలో అభిరుచి వస్తుంది. కొంచెం ఎదిగిన పిల్లలైతే కథల పుస్తకాలు, డ్రాయింగ్‌ పుస్తకాలు ఇస్తే రంగుల బాక్సులు ఇస్తే వారికి చిత్రకళపై అవగాహన వస్తుంది. ఇక డాన్స్‌ వేసే భంగిమల బొమ్మలు ఇవ్వడం వల్ల డాన్స్‌నేర్చుకోవాలనే ఆసక్తి వస్తుంది. చదివే ఆసక్తి కలుగుతుంది. ఒక పిల్లాడు సంగీతం పాడుతూ చేతులతో పుస్తకంలో కాగితాలు చింపడం మొదలుపెట్టాడు. అపుడు ఆ టీచరు వాడికి పేపర్‌తో రకరకాల బొమ్మల తయారీ గురించి వివరిస్తే వాడికి ఒక కొత్త ఆసక్తి వచ్చింది. బహుమతి అనేది చిరకాలం జ్ఞాపకం ఉండేలా ఇవ్వాలన్నది కొందరి అభిరుచి. అయితే ఈ తరహా బహుమతులు కొంత ఖరీదు అయినా కొంతకాలమైనా ఇష్టంగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. ముందు చిన్నపిల్లల బహుమతి నుంచి ప్రారంభిస్తే ఆడుకోవడానికి శబ్దం చేసే బొమ్మలు, గిలకలు కొత్తగా వస్తున్న పక్క పరుపులు దిళ్లు వంటివి అయితే కొంతకాలం వాడతారు. డ్రస్సులు, సబ్బులు, పౌడర్లు కూడా ఇస్తుంటారు

. అవి వారి అభిరుచిని బట్టి ఉంటుంది. అదే కొంచెం జ్ఞానం తెలిసిన పిల్లయితే ఆటవస్తువ్ఞలు, చిన్న స్కూటర్లు, కార్లు వంటివి కొని ఇవ్వవచ్చును. ఈ రోజుల్లో ఏ బొమ్మ కొనాలన్నా 500 నుంచి మొదలు పెట్టి పదివేలు దాటుతున్నాయి. నాకు తెలిసిన ఒకరు పిల్లాడు ఆడుకోవడానికి గిటారు, కీబోర్డు కొనిచ్చారు. క్రమక్రమంగా ఆ పిల్లాడిలో అవి నేర్చుకోవాలనే తపన మొదలయ్యింది. ఒకవిధంగా పిల్లల్లో సృజనాత్మకత వారు వాడే బొమ్మల్ని బట్టి వస్తుంది. అందుకే పిల్లలకిచ్చే బహుమతుల వల్ల వారిలో ఆసక్తి అభిరుచి పెరుగుతాయి అని మనం గ్రహించవచ్చు. అంతేకాదు వారికి సంగీతంలో అభిరుచి వస్తుంది. కొంచెం ఎదిగిన పిల్లలైతే కథల పుస్తకాలు, డ్రాయింగ్‌ పుస్తకాలు ఇస్తే రంగుల బాక్సులు ఇస్తే వారికి చిత్రకళపై అవగాహన వస్తుంది. ఇక డాన్స్‌ వేసే భంగిమల బొమ్మలు ఇవ్వడం వల్ల డాన్స్‌నేర్చుకోవాలనే ఆసక్తి వస్తుంది. చదివే ఆసక్తి కలుగుతుంది. ఒక పిల్లాడు సంగీతం పాడుతూ చేతులతో పుస్తకంలో కాగితాలు చింపడం మొదలుపెట్టాడు. అపుడు ఆ టీచరు వాడికి పేపర్‌తో రకరకాల బొమ్మల తయారీ గురించి వివరిస్తే వాడికి ఒక కొత్త ఆసక్తి వచ్చింది. ఈవిధంగా బహుమతులు పిల్లల్లో ఆసక్తి కల్గించేలా ఉండాలి. ఇంక స్టేజీమీద జరిగే ప్రొగ్రామ్స్‌తో రకరకాల లామినేషన్స్‌ మెమెంటాలు ఇస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. జీవితకాలం అట్టే పెట్టుకుని రేపటి తరానికి స్ఫూర్తిగా ఉంచాలి. బర్త్‌డేలు, పంచ పేరంటాలు, ఉపనయనం, గృహప్రవేశం, పెళ్లి వంటివాటికి అయితే వారికి ఇంటిలో ఉపయోగించే వస్తువ్ఞలు, బట్టలు, కిచెన్‌వేర్‌ వంటివి ఇస్తే గుర్తుగా ఉంటుంది. కుక్కర్లు, ప్యాన్‌లు, పాన్లు , డిన్నరుసెట్టు, ‘టి సెట్లు వంటివి మంచివి. ఆ మధ్య ఒక పెళ్లిలో సీల్‌ఫ్యాన్‌లు, డిజిటల్‌ కెమెరా వంటివి ఇచ్చారు. వారి అనుబంధం రక్తసంబంధం బట్టి ఉంటుంది. వారికి ఉపకరించే వస్తువ్ఞలయితే ఆనందంగా వినియోగించుకొంటారు. ఈమధ్యకాలంలో రిటన్‌గిఫ్ట్స్‌ ప్రహసనం మొదలయ్యింది. మనం ఇచ్చిన గిఫ్టుకి సరిపడా తిరిగి గిఫ్ట్స్‌ అభినందనలతో అని ఇచ్చేస్తున్నారు. మేం చేసిన ఫోన్‌ పిలుపులకి మీరు వచ్చినందుకు అభినందనలు అంటూ ఈ బహుమతులను ఇస్తున్నారు. ఎక్కడెక్కడినించో అభిమానంతో వచ్చి మనల్ని దీవించి మనతో ఆనందం పంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు అందరి జీవితాలు బిజిబిజీగా ఉంటున్నాయి. ఉద్యోగమో, ఉపాధియో ఏదోరకంగా బిజీగా ఉంటున్నారు. అటువంటి వారు తమ ఆహ్వానం అందుకుని వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలపడం సహజం అనేకంటే మినిమమ్‌ కర్టసి అని చెప్పాలి. ఇక బహుమతి విషయానికి వస్తే గాజుపింగాణి వంటి వస్తువ్ఞలు ఇవ్వడం అంతమంచిది కాదు. అవి ఎక్కువకాలం వాడుకోలేరు. అవి పగిలిపోతే బాగుండదు. ఎక్కువకాలం ఉపయోగపడే వస్తువ్ఞ ఇస్తే బాగుంటుంది. ఈమధ్య ఆన్‌లైన్‌ బుకింగ్‌లు వచ్చాక వేడుకకు తగినట్లుగా బహుమతులు మనం వెళ్లకపోయినా వేరే ఊరికి పంపవచ్చును. ఇంక వివిధ సంఘకార్యక్రమాల్లో సేవాసంస్థల్లో ‘కిట్స్‌ అని రిటరిన్‌ గిఫ్ట్స్‌ ఇస్తూ ఉంటారు. అందులో ఒక పెద్ద ఐటమ్‌, మెమెంటోగాని, లంచ్‌కప్స్‌, లేదా పాన్‌, చిన్నకుక్కర్‌ వంటివి పెట్టి కాగితం బుక్స్‌ పెట్టి ఇంకా గృహపరిక రాలు, బిస్కట్సు చాక్‌లెట్స్‌ వంటివి ఉంచి బహుమతిగా ఇస్తూ ఉంటారు. తమ ఉనికిని తెలిపేందుకు ఇది ఒక విన్నూత్న పద్ధతి. ఇవి ఎక్కువ సేవాసంస్థల్లో ఉంటుంది. ఇలా సాహితి సంస్థల్లో కూడా ఇస్తున్నారు. ఇది ఒక సాంప్రదాయం. మనం వెళ్లినందుకు అభినందనలు ఈవిధంగా తెలుపుతారు. మనకెన్ని పనులు ఉన్నా మనసిచ్చిన బహుమతి ఒక రూపమని భావిస్తాం. ఒక్కొక్కసారి మనం ఇచ్చిన బహుమ తికన్నా ఎక్కువ విలువైన రిటన్‌గిఫ్ట్‌ ఉంటాయి. కనుక మనం ఇచ్చే బహుమతులు అకేషన్‌ను బట్టి అందిస్తే అందరికి అభినందనే, ఒక మధుర జ్ఞాపకమే. అందుకే అభిరుచులను బట్టి ఎంపిక చేసుకోవడంలోనే మన విజ్ఞత ఉంది.

– ఎన్‌.వాణిప్రభాకరి