‘బహుజన వామపక్ష వేదికలో సిపిఐని భాగస్వామ్యం

sitaram yechury
sitaram yechury

హైదరాబాద్‌: ప్రత్నామ్నాయ విధానాలతో గురువారం రాష్ట్రంలో ఏర్పడ్డ ‘బహుజన వామపక్ష వేదిక (బిఎల్‌ఎఫ్‌)లో సిబిఐ కూడా భాగస్వామ్యం కావాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని సిపిఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కోరారు. బిఎల్‌ఎఫ్‌ ఆవిష్కరణ సభకు హాజరైన సీతారాం ఏచూరి తెలంగాణ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు బి. వెంకట్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న సుధాకర్‌రెడ్డిని వారి ఇంటిలో కలిశారు. దేశ, రాష్ట్ర రాజకీయాలను ఉభయుల చర్చించుకున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన బిఎల్‌ఎఫ్‌ ఆవిష్కరణ సభ, విధానపత్రం, పాల్గొన్న పార్టీలు, ప్రజల్లో వస్తున్న స్పందనను సుధాకర్‌రెడ్డి దృష్టికిత ఏచూరి తెచ్చారు వామపక్షాలు, సామాజిక తరగతులు, అభ్యుదయవాదులు ఐక్యంగా తెలంగాణలో చేస్తున్న కృషి బాగా ఉందని ఈ ఆవిర్బావ సభ ద్వారా మరోసారి వ్యక్తమైందని ఏచూరి తెలిపారు. సిపిఐ కూడా బిఎల్‌ఎఫ్‌లో చేరితే మరింత బలోపేతం, అందుకు తెలంగాణ సిపిఐ సమితి సానుకూలంగా నిర్ణయం తీసుకునేటట్లు మీరు చొరవ తీసుకోవాలని సుధాకర్‌రెడ్డిని సీతారాం ఏచూరి కోరారు.