బలవంతంగా చందాలు వసూళ్ళు చేస్తే కఠిన చర్యలు: సీపీ మహేందర్‌రెడ్డి

cp mahender reddy
cp mahender reddy

హైదరాబాద్‌: వినాయక చవితి సమీపిస్తున్న తరుణంలో మండపాల నిర్వహకులకు, ప్ర‌జ‌ల‌కు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమీషనర్‌
మహేందర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్‌ చందాల పేరుతో ఎవరైనా బల
వంతపు వసూళ్లకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేయాలని, శాంతికి భంగం కలిగించాలని చూస్తే వారిపై చట్ట పరంగా
చర్యలు తప్పవని ఆయన తెలిపారు. గణేష్‌ మండపాల నిర్వహకులు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని, విగ్రహాల
ఉరేగింపులో బాణాసంచా పేల్చడం నిషేదం అని ఆయన సూచించారు.