బరువు తగ్గించే తీగజాతి కూరల రసాలు

JUICE
JUICE

బరువు తగ్గించే తీగజాతి కూరల రసాలు

అనేక రకాల రుగ్మతల నివారణలో ఆయుర్వేద, యునాని వైద్య చికిత్సల్లో తీగజాతి కూరలను వాడుతారు. వీటి ద్వారా పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. క్యాలరీలు తక్కువ. వీటిలో నీటి శాతం చాలా ఎక్కువ. బరువ్ఞ తగ్గాలనుకునేవారికి, మంచి ఆరోగ్యం కావాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి దృష్టికి ప్రయోజనకరమైనవి. బరువ్ఞ తగ్గాలనుకునేవారికి బీరకాయ మంచి ఆహారం. రక్తంలో చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణవ్యవస్థకు సహకరించి, మలబద్దకానికి చికిత్సగా సహకరిస్తుది.

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎంచుకోవడంలో చర్మం గట్టిగా, నిగనిగలాడుతూ ఉండాలి. మచ్చలు ఉండకూడదు. వడిలిపోయినట్లున్న వాటిని ఎంచుకోకూడదు. గిల్లి చూస్తే కాయ లేతదనం అర్ధమవ్ఞతుంది. ముదురు కాయలు పీచుపట్టి పనికిరావ్ఞ. పొట్లకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి, నీరు, పీచు అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు, ఫ్యాట్స్‌, కార్బోహైడ్రేట్స్‌, విటమిన్‌ బి కాంప్లెక్స్‌, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, బీటా కెరోటిన్‌ వంటి ఖనిజాలు బాగా లభిస్తాయి. 100 గ్రాముల పొట్లకాయలో పద్దెనిమిది క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీని రసం మంచి ప్రయోజనకారి. రోజుకు రెండు సార్లు స్పూన్‌ రసం తాగాలి. దీనిలో ఉండే నీరు, ఫైబర్‌ వల్ల డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

జీర్ణక్రియకు సహకరించి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాబట్టి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. శారీరక వ్యవస్థ నుంచి మ్యూకస్‌ను వెలికి నెట్టేయగల గుణాలు పొట్లకాయకు ఉన్నాయి. పొట్ల ఆకుల రసాన్ని మాడుకు మసాజ్‌ చేయడం వల్ల బట్టతలకు దారి తీసే రుగ్మతకు సహకరిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. ప్రాచీన వైద్యంలో పొట్ల ఆకులు, కొత్తమీర నుంచి తీసిన కషాయాన్ని జ్వరాల చికిత్సలో వాడేవారు. నిండు ఆకుపచ్చ నుంచి తెల్లగా, గట్టిగా, మెత్తని చర్మంతో ఉండే కాయలు ఎంచుకోవాలి. పొట్టకాయ గింజలు ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తిన్నట్లయితే వికారం, డయేరియా, ఉదర సంబంధిత అసౌకర్యం, అజీర్ణం కలుగుతాయి. క్రమం తప్పకుండా సొరకాయ రసం తాగుతుంటే బరువు తగ్గుతారు

. నరాలకు సొరకాయ రసం టానిక్‌ లాంటిది. నాడీ వ్యవస్థపై చల్లని ప్రభావం చూపుతుంది. దీనిలోని అత్యంత పీచు పదార్థం. లో ఫ్యాట్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. సొరకాయ తినడం వల్ల దీనిలోని నీటిశాతం కడుపు నిండుగా ఉన్న భావాన్ని కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువ్ఞ తగ్గుతారు. మూత్ర సంబంధిత లోపాల్ని సరిచేయగలదు. తాజా సొరకాయరసాన్ని ఒక టీ స్పూన్‌ నిమ్మరసంతో కలుపుకుని తాగితే అధిక యాసిడ్‌ లెవెల్స్‌ వల్ల మూత్రంలో కలిగే మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నిద్రలేమికి సొరకాయ మంచి చికిత్స. సొరకాయ రసాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మచ్చలు లేకుండా నిగారిస్తుంది. రసాన్ని ఏ ఇతర జ్యూస్‌లతోనూ కలపకుండా ఉంటేనే మంచిది. రసం తాగాక ఉదరంలో నొప్పి, వికారం, వాంతులు ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించాలి. ఇంకా పుచ్చ, ఖర్బూజా ఈ కోవలోకే వస్తాయి.

వీటిలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్స్‌ ఉండడంతో వేసవితాపాన్ని తీర్చుతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. ఎ,బి,బి6, బి7, సి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు, కాపర్‌, ఐరన్‌, జింక్‌ కొద్ది మోతాదులో లభిస్తాయి. బీటా కెరోటిన్‌కు మంచి ఆధారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ప్రీ ర్యాడికల్స్‌ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. ఈ ప్రీ ర్యాడికల్స్‌ ఆస్త్మా, ఆర్థరైటిస్‌, కరోనరి గుండు జబ్బులకు కారణమవ్ఞతాయి. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచగలదు. ఇతర పోషకాలు కూడా కొలెస్టరాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. మెలన్‌లలో ఫ్యాట్‌, సోడియం తక్కువగా ఉండి, నీటి శాతం, పీచు పదార్థ శాతం అధికంగా ఉంటాయి. వీటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.