బయోలాజికల్‌ ఇ వ్యాక్సిన్‌ తయారీ

b3

బయోలాజికల్‌ ఇ వ్యాక్సిన్‌ తయారీ

హైదరాబాద్‌, : బంగారు తెలంగాణ సాధనలో పరిశ్రమలవృద్ధి కీలకమని, తెలంగాణలో ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న బయాలిజికల్‌ ఇ యాజమాన్యం రాష్ట్రఅభివృద్ధిలో పాలుపంచుకోవడం ముదావహమని రాష్ట్రఐటి పరిశ్రమలశాఖ మంత్రి కెటిరామారావు పేర్కొన్నారు. నగర శివార్లలోని జినోమ్‌ వ్యాలీలో కొత్త వ్యాక్సిన్‌ తయారీ ప్లాంట్‌కు జరిగి న శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రభుత్వ పారిశ్రామిక విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు నేడుముందుకువస్తున్నారని, తెలంగాణలో హైదరా బాద్‌ను భారత్‌ పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్న తమకు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. బయా లజిక్స్‌ కంపెనీస్‌ భారత్‌లో ఇప్పటివరకూ తెలంగాణ బైట ప్రాంతం లోనే ఉన్నాయని, ప్రభుత్వ నిర్ణయాలు విధివిధానాలతో ఇక నేరుగా తెలంగాణనుంచే ఎగుమతులకు వీలు కలుగుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సార్వత్రిక వ్యాధినిరోధక కార్యక్రమానికి వ్యాక్సిన్‌లే కీలకమన్నారు.

మేడ్చల్‌ జిల్లా కొల్తూరువద్ద ఏర్పాటుచేస్తు న్న ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపనచేసారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎండి మహిమా దాట్ల, జాన్సన్‌ అండ్‌జాన్సన్‌ ప్రపంచ ఛైర్మన్‌ డా.పాల్‌ స్టోఫెల్స్‌, ఐటిశాఖకార్యదర్శి జయేష్‌రంజన్‌, ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్యస్వామి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. ఈసందర్భంగా జరిగిన సభలో కెటిఆర్‌ మాట్లాడుతూ ముఖ్య మంత్రి కలలసాకారం బంగారు తెలంగాణను నిజం చేసేందుకు వీలు గా మరింతగా పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు ముందుకురావాలని కోరా రు.

కంపెనీ ఎండి మహిమా దాట్ల మాట్లాడుతూ ప్రాథమికంగా 300 కోట్ల పెట్టుబడులతో ఈ యూనిట్‌ ప్రారంభించనున్నామన్నారు. ఇదే ప్లాంట్‌ నుంచి మరిన్ని కొత్త ఉత్పత్తులు తయారవుతాయని ఇప్పటికే జినోమ్‌వ్యాలీలో వెయ్యికోట్ల పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా ఈ ప్లాంట్‌పై 300కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. కొత్తసెజ్‌లో వ్యాక్సిన్‌ ప్లాంట్‌ 29 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసా మని, దీని వల్ల వెయ్యిమందికిపైగా ఉపాధి కలుగుతుందని వివరిం చారు. ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపనకు ఎంతో ప్రోత్సాహకరంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలున్నాయని, ఇందుకు అనుగుణంగానే తాము సత్వరమే ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రత్యేకించి పరిశ్రమలశాఖాపరంగా అనుమతులు సత్వరమే వస్తు న్నాయన్నారు. తెలంగాణలో సానుకూలంగా బిజినెస్‌ కార్యకలా పాలు కొనసాగేందుకు వీలుగా ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్లు ఐటిశాఖ కార్యదర్శి వెల్లడించారు.