‘బన్నీ’ కార్వాన్ కు స్వల్ప ప్రమాదం

అల్లు అర్జున్ సురక్షితం…

The-Lorry-that-hit-the-caravan

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్ ప్రమాదానికి గురైంది.. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం అల్లు నటిస్తున్న ‘పుష్ఫ’ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ కు కార్వాన్ బయలుదేరింది..

ఖమ్మం సమీపంలో వెనుక నుంచి కార్వాన్ ను లారీ ఢీకొంది. సత్యనారాయణ పురం బైపాస్ వ‌ద్ద రూరల్ ఏసిపి ఆఫీసు సమీపంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అల్లు అర్జున్ ఆ కార్వాన్ లో లేకపోవడంతో సురక్షితంగా ఉన్నారు.