బన్నివాసు నిర్మాణంలో హీరోయిన్‌గా రష్మిక

RASHMIKA
RASHMIKA

బన్నివాసు నిర్మాణంలో హీరోయిన్‌గా రష్మిక

2016లో వరుసగా సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, థృవ లాంటి హ్యట్రిక్‌ సూపర్‌హిట్స్‌తో దూసుకుపోతున్న గీతా ఆర్ట్స్‌కి అనుబంధ సంస్థగా జిఎ2 బ్యానర్‌లో భలే భలే మగాడివో§్‌ు లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్నివాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మంచి కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విజయాన్ని సాధించిన శ్రీరస్తు శుభమస్తు దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నచిత్రంగా విడుదలయ్యి ట్రేడింగ్‌ సక్సస్‌గా సొంతం చేసుకున్న అర్జున్‌రెడ్డిచిత్రంతో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజ§్‌ు దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. బన్ని వాసు నిర్మాతగా నాగచైతన్యతో 100శాతం లవ్‌, సాయిధరమ్‌తేజ్‌తో పిల్లా నువ్ఞ్వలేని జీవితం, నానితో భలే భలే మగాడివో§్‌ు ఇప్పుడు విజ§్‌ు దేవరకొండతో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్‌గా ఎంపికైంది. కన్నడ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా దూసుకెళుతున్న రష్మిక…కిరాక్‌ పార్టీ చిత్రంతో అందరి మనసుల్ని దోచుకుంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.