బనానా యామ్‌ పటియా

RUCHI111
RUCHI111

బనానా యామ్‌ పటియా

కావలసినవి: కంద-అరకిలో కూర అరటికాయలు-పావ్ఞకిలో కొబ్బరికాయ-1, మిరియాలు-రెండు టీస్పూన్లు ఆవాలు-రెండు టీస్పూన్లు, పసుపు-రెండు టీస్పూన్లు, కరివేపాకు-ఒక రెబ్బ, ఎండుమిరపకాయలు-4 నెయ్యి-ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు-తగినంత

తయారుచేసే విధానం

కందను శుభ్రం చేసి పై చెక్కుతీసి, అంగుళం వెడల్పులో ముక్కలు కోసుకోండి. ఉప్పు కలిపిన నీటిలో ఈ ముక్కలు వేసి ఒక గంటసేపు నానబెట్టండి. అరటికాయలను పై చెక్కుతీసి,కింద ముక్కలంత పరిమాణంలో కోసుకోండి. మిరియాలను నూరి పొడి చేసుకోండి. మూడు కప్పుల నీటిని ఒక పాత్రలో మరిగిం చండి. అందులో పసుపు, ఉప్పు, విరియాల పొడి వేయండి. నానబెట్టిన కంద ముక్కలను ఈ నీటిలో వేసి ఉడికించండి. కంద సగం ఉడికిన తరువాత అరటి ముక్క లను వేయండి. నీరు తగ్గితే మరికొంచెం నీటిని చేర్చి ఉడికించండి. కొబ్బరి కోరుకుని మెత్తగా నూరి ముద్దచేయండి. నూరిన కొబ్బరి నుండి ఒక టేబుల్‌ స్పూన్‌ ముద్దను తీసి ప్రక్కన ఉంచిన కాయగూర ముక్కలను ఉడికిన తరువాత కొబ్బరి ముద్దను అందులో వేయండి. మరో పదినిమిషాలు ఉడికించి దించండి. నేతిని కళాయిలో వేడిచేసి కరివేపాకు, చిదిమిన ఎండుమిర్చి, ఆవాలు వేసి అవి చిటపట లాడుతుండగా ఉడికిన మిశ్రమాన్ని అందులో వేసి కలిపి 5నిమిషాలు సన్నని మంటమీద మగ్గనిచ్చి దించండి. వేడి వేడి బనానా యామ్‌ పాటియా రెడీ. విడిగా కందను తినలేనివారు ఇలా చేసుకోవచ్చు.