బడ్జెట్‌ బాటలో లోక్‌సభ

BUDGET
BUDGET

బడ్జెట్‌ బాటలో లోక్‌సభ

న్యూఢిల్లీ: బడ్జెట్‌ పార్లమెంటు సమావ ేశాల్లోనేట్రిపుల్‌ తలాక్‌ సవరణబిల్లు ఆమోదానికి శక్తివంచనలేకుండా కృషిచేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశంలో వెల్లడిం చారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ఎదురుదాడికిదిగాలని నిర్ణయిం చాయి. రాజ్యాంగబద్దమైన సంస్థలు, అత్యాచా రాలు, వ్యాపారుల సమస్యలపై పార్లమెంటును స్తంభింపచేయాలని నిర్ణయించాయి. అయితే అధికారపక్షం మాత్రం ట్రిపుల్‌ తలాక్‌ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకువీలుగా వివిధ పార్టీ లనుసంప్రదించి ఏకాభిప్రాయసాధనకు కృషిచేస్తా మని వెల్లడించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా అఖిలపక్షసమావేశం నిర్వహించారు.

PM MEETING
PM MEETING

పార్లమెంటు హౌస్‌లో జరిగిన ఈసమావేశంలో అన్ని పార్టీలు బడ్జెట్‌ సమావేశాలు సజావుగాసాగేందుకు సహక రించాలని కోరారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాధ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, అనంత్‌ కుమార్‌ తదితరులుహాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ మాట్లా డుతూ అఖిలపక్ష సమావేశం మంచి ఫలితాలి చ్చిందని అన్నారు. బడ్జెట్‌సమావేశాలు విజయ వంతం అయ్యేందుకు సహకరించాలని ప్రధాని కోరారని వెల్లడించారు.

ప్రభుత్వం ట్రిపుల్‌తలాక్‌ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకువీలుగా అన్నిచర్యలు తీసుకుంటున్నదని అన్నారు. అన్ని పార్టీలనుంచి ఏకాభిప్రాయంసాధనకు ప్రభుత్వం కృషిచేస్తుందని అన్నారు. అప్పటికప్పుడు తలాక్‌ చెప్పే ట్రిపుల్‌ తలాక్‌బిల్లుతోపాటు ప్రభుత్వం ఒబిసి కమిషన్‌కు రాజ్యాంగహోదా కల్పించే బిల్లునుకూడా ప్రవేశపెడుతోంది. అయితే ప్రతి పక్షం మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మహిళలపై అత్యాచారాలు, వివిధ ప్రాంతాల్లో దాడులు, రాజ్యాం సంస్థల హోదా, వ్యాపారుల సమస్యలు వంటి వాటిని ప్రస్తావించాలని చూస్తోంది.

ప్రభుత్వం సహకారతత్వాన్ని పెంచు కోవాల్సి ఉంటుందని, ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై స్పందించేందుకు కృషిచేయాలని కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారి పేర్కొన్నారు. ప్రతిపక్షాలనుంచి కాంగ్రెస్‌పరంగా మల్లిఖార్జున ఖర్గే, సమాజ్‌వాది పార్టీనుంచి ములాయంసింగ్‌ యాదవ్‌, సిపిఐనుంచి డి.రాజా, డిఎంకెనుంచి కణిమోజి, టిఎంసినుంచి డెరెక్‌ ఓ బ్రైన్‌, సుదీప్‌ బంధోపాధ్యా§్‌ు, ఎన్‌సిపినుంచితారిఖ్‌ అన్వర్‌లు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశం తొలుత రాష్ట్రపతిఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. తదనంతరం ఆర్ధికసర్వేను ప్రవేశపెడతారు. ఆర్ధికమంత్రిఅరుణ్‌జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటవ తేదీ పార్లమెంటులో ప్రవేశపెడతారు. మొదటివిడత సమావేశాలు వచ్చేనెల 9వ తేదీతో ముగుస్తాయి. తదనంతరం మళ్లీ మార్చి ఐదు నుంచి ఏప్రిల్‌ఆరవ తేదీవరకూ కొనసాగుతాయి.