బడ్జెట్‌ చర్చకు

 

kkkk

నాజూగ్గా.. ఉండే బాలీవుడ్‌ భామ కరీనాకపూర్‌ తాజాగా వార్తల్లోకి వచ్చారు. గ్లామర్‌ ప్రపంచంలో తనకంటూ ్పత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె … ఇపుడు అందుకు భిన్నమైనరంగానికి సంబంధించి తన ప్రతిభను ప్రదర్శించనున్నారు. తలపండిన ఆర్థిక వేత్తలు విశ్లేషించే సాధారణ వార్షిక బడ్జెట్‌ లైవ్‌ చర్చకోసం ఆమె ఒక బిజినెస్‌ ఛానల్‌కు వెళ్లనుంది. ఫిబ్రవరి 29న లోక్‌సభలో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్‌పై విశ్లేషణ చేసేందకు ఆమె సిద్ధమైనట్టు కరీనా సన్నిహితులు చెప్పారు. ఇకపోతే తాజాగా ఆమె నటించిన ‘కీ అండ్‌ కా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రంలో ఆమె ఉద్యోగం చేస్తూ ఇంటిని నడిపే మోడ్రన్‌ భార్యగా, ఆమె భర్త ఇంట్లో ఉండి పిల్లల బాధ్యతలు చూసే వ్యక్తిగా (అర్జున్‌కపూర్‌) పాత్రలు ఉంటాయి. చిత్రానికి తగ్గట్టు ఆమె పోషించిన మోడ్రన్‌ విమెన్‌కు తగ్గట్టు బడ్జెట్‌ సందర్భంగా సగటు వ్యక్తి స్పందన ఏమిటన్న కోణంలో ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలుస్తోంది..