బడి గంట

బాల గేయం
                                                   బడి గంట

SCHOOL BELL
SCHOOL BELL

గంట మోగుతున్నది
బడికి రమ్మన్నది
పాఠాలు నేర్వుమన్నది
నీ బతుకు దెర్వునన్నదో

శ్రీవాణికి మొక్కుమన్నది
నీహక్కు నైతనన్నది
మంచి వినయమన్మది
నీకు నడిచె దారి నన్నదో

పాట నేర్వుమన్నది
నీగొంతుక నైతనన్నది
ప్రతిభ చూపుమన్నది
నీ కీర్తిని నేనన్నదో

కులమత రహిత మన్నది
కూరిమి చేయమన్నది
విజ్ఞాన గని నన్నది
విశ్వానికెగురుమన్నదో

ప్రేమ పంచుమన్మది
పెన్నిధిగా ఆరుమన్నది
దయను చూపుమన్నది
ధరిత్రి నవ్ఞ్వ నన్నదో
– అన్నల్‌దాస్‌ రాములు