బఠాణీ కచోరి

kachori
kachori

బఠాణీ కచోరి

కావలసినవి
బఠాణీ-అరకిలో, నూనె-100గ్రా జీలకర్ర-ఒక టీస్పూన్‌, పసుపు-ఒక టీస్పూన్‌ ఇంగువ-రెండు టీస్పూన్లు, పంచదార-50గ్రా పచ్చిమిర్చి-100గ్రా, గరంమసాలా-ఒక టీస్పూన్‌ మైదాపిండి-పావ్ఞకిలో, నెయ్యి-50గ్రా ఉప్పు-తగినంత, నూనె-వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
మందపాటి గిన్నెలో బఠాణీ వేసి కాసిని నీళ్లు పోసి అవన్నీ ఆవిరయ్యే వరకు ఉడికించాలి. తరువాత మెత్తగా ఉడికించిన బఠాణీని గరిటెతో చిదిమి ముద్దలా చేసుకోవాలి, అందులోనే పసుపు, ఇంగువ, పంచదార, పచ్చిమిర్చి ముద్ద, గరంమసాలా, ఉప్పువేసి కలపాలి. మైదాలో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పూరీపిండిలా కలుపుకుని గుండ్రంగా చిన్న పూరీలా వత్తాలి. అందులో బఠాణీ మిశ్రమంతో చేసిన ఉండను పెట్టి దానిమీదుగా పూరీని గుండ్రంగా మడవాలి. తరువాత బాణలిలో వేయించడానికి సరిపడా నూనెపోసి అందులో వీటిని వేసి వేయించాలి. వేడివేడి మటర్‌ కచోరి రెడీ.