‘బటర్‌ ఫ్లయిస్‌’ ఫస్ట్‌లుక్‌

butterflies
butterflies

నిర్మాతగా వంద చిత్రాలకు చేరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్‌పై 92 చిత్రంగా బటర ఫ్లయిస్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఫణిరాజ్‌ దర్వకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందరూ ఆడవాళ్లే నటిస్తుండటం విశేషం. జోత్సశర్మ, హర్షిణి, మేఘనానాయుడు, రోజాభారతి తదితరులు లీడ్‌రోల్స్‌లో నటిస్తున్నారు. సీనియర్‌ రాజకీయ నేత , ఎపి మాజీ సిఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్యగారు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామసత్యనారాయణ సినిమా అంటే ఫ్యాషన్‌ ఉన్న వ్యక్తి వంద సినిమాలకు చేరువయ్యారు. అందరూ ఆడవాళ్లతోచేస్తున్న ఈచిత్రం ఓ మంచి ప్రయోగం అన్నారు. అలాగే సక్సెస్‌ఫుల్‌ సినిమా చేయాలని ఆశిస్తున్నానన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ, సినిమా చిత్రీకరణ పూర్తయిందని, జనవరి 26న విడుదల చేయనున్నామన్నారు. రోశయ్యగారు ఫస్ట్‌లుక్‌ను విడుదలచేయటం ఆనందంగా ఉందన్నారు. అందరూ ఆడవాళ్లే నటిస్తున్న ఈచిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. ప్రధానపాత్రలో జోత్స శర్మ , హర్షిఫి, మేఘనా, రోజాభారతి, జయ, ప్రవళ్లిక తదితరులు నటిస్తున్నారు.