బజాజ్‌పల్సర్‌ నుంచి కొత్త బైక్‌లు

b1

బజాజ్‌ పల్సర్‌ నుంచి కొత్త బైక్‌లు

హైదరాబాద్‌,: బజాజ్‌ కంపెనీ కొత్తగా బిఎస్‌ పల్సర్‌ను విడుదలచేసింది. బిఎస్‌4 పల్సర్‌ ఆర్‌ఎస్‌ 200, ఎన్‌ఎస్‌200ను మార్కెట్‌కు విడుదలచేసింది. కొత్త లుక్స్‌తో అప్‌గ్రేడెడ్‌ బిఎస్‌4 ఇంజన్లతో పల్సర్‌ ఆర్‌ఎస్‌200 ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం 1,21,881 రూపాయలుగాను, పల్సర్‌ ఎన్‌ఎస్‌200 ప్రారంభ ధర 96,453రూపాయలుగాను ఉందని కంపెనీ ప్రకటించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎబిఎస్‌ ఇందన ఇంజెక్షన్‌, లిక్విడ్‌కూలింగ్‌, పెరీమీటర్‌ఫ్రేమ్‌, ట్విన్‌ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌తో బైక్‌లు వచ్చాయి. అత్యధిక వేగం 141 కెఎంపి హెచ్‌తో ఉంటుంది. పల్సర్‌ ఆర్‌ఎస్‌200 కొత్త క్రాఫిక్‌స్కీమ్స్‌ రేసింగ్‌ బ్లూ, గ్రాఫైట్‌ బ్లాక్‌లో లభి స్తోంది. వీటి విడుదల సందర్భంగా కంపెనీ మోటార్‌ సైకిల్‌ బిజినెస్‌ అధ్యక్షుడు ఎరిక్‌వాస్‌ మాట్లాడుతూ దేశంలో మోటార్‌సైక్లింగ్‌ సాంకేతి కతలను మరింత వృద్ధి చేయడంలో బజాజ్‌ ముందంజలో ఉందని అన్నారు. కొత్త పల్సర్‌శ్రేణి బైక్‌లు మోటార్‌సైక్లిస్ట్‌లకు మరింత నాజూకుగా ఉంటాయని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు.