బగ్గిడి గోపాల్‌ షూటింగ్‌ ప్రారంభం

BAGGIDI GOPAL
BAGGIDI GOPAL

బగ్గిడి ఆర్ట్‌మూవీస్‌ పతాకంపై బగ్గిడి గోపాల్‌ ప్రధానపాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్‌ బగ్గిడిగోపాల్‌. రైటు రైటు టు అధ్యక్షాఅనేది క్యాప్షన్‌. భవ్యశ్రీ శ్వేతారెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, అర్జున్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం ఫిల్మ్‌చాంబర్‌లో జరిగింది. మాజీ గవర్నర్‌ కె.రోశయ్య తొలి సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు. టిఎస్‌సిసి చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సాయి వెంకట్‌ గౌరవ దర్శకత్వంవహించారు. మాజీ ఎమ్మెల్యే, నిర్మాత, నటుడు బగ్గిడిగోపాల్‌ మాట్లాడారు. ఒక సామాన్య ఆర్టీసీ కండక్టర్‌ అయిన తాను ఎమ్మెల్యేగా ఎలా ఎదిగాను అనేది ఒకటో పార్ట్‌గా చిత్రీకరిస్తామన్నారు. ఆకలి తెలిసిన వాడు ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఎలా సేవ చేస్తాడు, శాసనసభలో ఎదుర్కొన్న సవాళ్లు , కొంతమంది వల్ల నా ఫ్యామిటీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నది రెండో పార్ట్‌లో చూపిస్తామన్నారు. ఇలా నాజీవితం విద్యార్థి దశ .నుంచి ఇప్పటి వరకు అనే మలుపులతో సాగింది ఇవన్నీ ఈచిత్రంలో ఉంటాయన్నారు. దర్శకుడు అద్భుతంగా తయారు చేయటం అనందంగా ఉందన్నారు.