బంగ్లాపై భారత్‌ ఘనవిజయం

ROHIT SHARMA
ROHIT SHARMA

దుబాయి: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై భారత జట్టు ఘనవిజయంసాధించింద.ఇ బంగ్లాదేశ నిర్దేశించుకున్న 174 పరుగుల లక్ష్యాన్ని 36.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి భారత్‌ ఛేదించింది. భారత్‌ బ్యాట్స్‌మాన్‌లలో రోహిత్‌శర్మ 83 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచారు. ధావన్‌ 40 పరుగులు, ధోని 33 పరుగులతో పర్వాలేదనిపించారు. అంతకుముందు టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌ దిగిన బంగ్లాదేశ్‌, భారత బౌలర్ల ధాటికి 174 రుగులు మాత్రమే చేయగలిగింది. చాలా కాలం తర్వాత భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్థానంలో తుదిజట్టులోనికి వచ్చిన రవీంద్ర జడేజా 4/29వద్ద బంతితో తిప్పేసాఉ. జడేజా మాయాజాలానికి భువనేశ్వర్‌ 3/32, బుమ్రా 3/37లు కూడా తోడవడంతో బంగ్లాదేశ్‌ పరుగులు చేయడంలో విఫలం అయింది. ఆశించినమేర స్కోరు చేయలేకపోయిన బంగ్లాదేశ్‌ 49.1 ఓవర్లలో 173 పరుగులకు ఆల్‌ఔట్‌ అయింది. బంగ్లా బ్యాట్స్‌మాన్‌ మెహిదీ హసన్‌ మీర్జా(42), మొర్తజా (26) మహ్మదుల్లా (25) ముష్మికర్‌ రహ్మాన్‌ 21లు ఓ మోస్తరుగా ప్రతిభను కనబరిచారు. అంతకుముందు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 174 పరుగులను సాధించింది. భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యాస్థానంలో తుదిజట్టులోనికి వచ్చిన రవీంద్ర జడేజా 4/29 బంతితో మెరుపులు మెరిసాడు. జడేజా మాయాజాలానికి భువనేశ్వర్‌ 3/32, బుమ్లా 3/37లపేస్‌ తోడవడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూకట్టారు. దీనితో బంగ్లాదేశ్‌ 49.1 ఓవర్లలో 173 పరుగులకు ఆల్‌ఔట్‌ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ మెహిదీ హసన్‌ మీర్జా(42), మెర్తజా (26) మహ్మదుల్లా (25), ముష్మికర్‌ రహ్మాన్‌(21)లదే స్కోర్‌కావడం విశేషం. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా మెహది హసన్‌ ఒంటరిపోరాటంచేయడం కనిపించింది దీనితో బంగ్లాదేశ్‌ గౌరవప్రదరమైన స్కోర్‌ చేయగలిగింది. మెర్తజా హసన్‌లు కొంత భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరకు భువనేశ్వర్‌ మెర్తజాను ఔట్‌చేయగా మెహదీ హసన్‌(42) ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌(3)లను బుమ్రా పెవిలియన్‌కు చేర్చడంతో బంగ్లా ఇన్నింగ్స్‌కు విజయవంతంగా తెరదించగలిగారు.