బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్‌

MISHIFIKA
MISHIFIKA

బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్‌

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న ఏకైక వన్డే టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ ముష్పికర్‌ రహీమ్‌ సెంచరీ నమోదు చేశాడు.262 బంతులు ఆడి 16 బౌండరీలు,2 సిక్సర్‌ సాయంతో ముష్పి కర్‌ సెంచరీ సాధించాడు. 6వికెట్లకు 322 పరు గులు ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగవ రోజు ఇన్నిం గ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ మొదట్లోనే రెండు వికెట్లను కోల్పోయింది.ఓవర్‌నైట్‌ ఆటగాడు మెహిది హసన్‌ మిరాజ్‌ 51 పరుగులు చేయగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన నాలుగవ బంతికి భువనేశ్వర్‌ బౌలిం గ్‌లో ఔటయ్యాడు.ఆ తరువాత తైజుల్‌ ఇస్లామ్‌ 10పరుగుల వద్ద ఉమేష్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు

దీంతో బంగ్లాదేశ్‌ 339 పరుగుల వద్ద ఎనిమిదవ వికెట్‌ను నష్టపోయింది. అయితే మరో ఓవర్‌ నైట్‌ ఆటగాడు ముష్పికర్‌ మాత్రం ఆత్మ విశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తూ సెం చరీ మార్క్‌ చేరాడు. టెయిలెండర్ల సహాయంతో క్రీజును అంటిపెట్టుకుని సెంచరీ పూర్తి చేశాడు.ఇది ముష్పికర్‌ టెస్టు కెరీర్‌లో ఐదవ సెంచరీ కాగా, భారత్‌పై రెండవ సెంచరీ. తద్వారా భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఒకే ఒక్క బంగ్లాదేశ్‌ ఆటగాడిగా ముష్పికర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా బంగ్లాదేశ్‌కు టీమిండియా భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 459 పరుగులు భారీ టార్గెట్‌ను బంగ్లా ముం దుంచింది. ఆదివారం నాలుగవరోజు ఆటలో భా గంగా భారత్‌ తన రెండవ ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 159 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. తన రెండవ ఇన్నింగ్స్‌లో భాగంగా మురళీవిజ§్‌ు 7 పరుగులు,కెఎల్‌ రాహుల్‌ 10 పరుగులు వద్ద మొదట్లోనే పెవిలియన్‌కు చేరినప్పటికి, కోహ్లీ 38 పరుగులు, అజింక్యా రహానే 28 పరుగులతో ఫర్వాలేదని పించారు. మరొకవైపు పుజారా 54 పరుగులతో హాఫ్‌ సెంచరీతో నాటౌట్‌గా కొనసాగు తుండగా జడేజా 16 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలువడంతో టీమిండియా భారీ టార్గెట్‌ను నిర్ధే శించగలిగింది.అంతకు ముందు తన తొలి ఇన్నిం గ్స్‌లో బంగ్లాదేశ్‌ 388 పరుగులకు ఆలౌటైంది

.6 వికెట్లకు 322 పరుగులతో ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ మొదట్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌ నైట్‌ ఆట గాడు మెహిది హసన్‌ మిరాజ్‌ 51 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేయగా నాలుగవ బంతికి భువనే శ్వర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తరువాత తైజుల్‌ ఇస్లామ్‌ 10 పరుగుల వద్ద ఉమేష్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు.మరో ఓవర్‌ నైట్‌ ఆటగాడు ముష్పికర్‌ రహీమ్‌ 262 బంతుల్లో 16 బౌండరీలు,2 సిక్స ర్లతో 127 పరుగులతో సెంచరీ సాధించి బాధ్యతా యుతంగా ఆడాడు.బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో షకీబుల్‌ హసన్‌ 82 పరుగులు,మెహిది హసన్‌ మిరాజ్‌ 51 పరుగులతో హాఫ్‌ సెంచరీలు చేయడం తో బంగ్లాదేశ్‌ నిలదొక్కుకుంది.టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 687 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 159 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది.

విజ§్‌ు 7 పరుగులు,రాహుల్‌ 10 పరుగులు, పుజారా 54 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేయగా కోహ్లీ 38 పరుగులు,అజింక్యా రహానే 28 పరుగులు జడేజా 16 పరుగులు చేయడంతో టీమిండియా 29 ఓవర్లలో 4వికెట్లకు 159 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 35 ఓవర్లలో 3 వికెట్లకు 103 పరు గులు చేసింది.తమీమ్‌ ఇక్లాబ్‌ 3 పరుగులు,సౌమ్యా సర్కార్‌ 42 పరుగులు, మొమినుల్‌ 9 పరుగులు చేయగా మహమ్మదుల్లా 9 పరుగులు,షకీబ్‌ 1 పరుగు వద్ద నాటౌట్‌గా క్రీజులో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌తో జరుగు తున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ కైవసం దిశగా టీమిం డియా సాగుతోంది.