బంగీ జంప్‌ సాహాసం.. ఆస్పత్రిలో న‌టి నటాషా

Natasha suri
Natasha suri

ఫెమీనా మిస్‌ ఇండియా వరల్డ్‌-2006 విజేత, బాలీవుడ్‌ నటి, వ్యాఖ్యాత నటాషా సూరీ ప్రమాదానికి గురైంది. బంగా జంప్‌ సాహాసం చేస్తుండగా ఆమె ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇండోనేషియాలో ఓ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె సాహాసాన్ని చేసిందని సమాచారం. నటాషాకు మామూలుగానే ప్రయాణాలన్నా, సాహాసానలన్నా విపరీతమైన క్రేజీ. అందువల్ల ఈ బంగీ జంప్‌ సాహాసం ఆమె చేసినట్లు తెలుస్తోంది. ఓ సరస్సుపై ఏర్పాటు చేసిన ఈ బంగా జంప్‌ సాహాసం చేస్తున్నప్పుడు తాడు కొద్దిగా తెగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుంది. ఐతే కింద రాళ్లురప్పలు లేకుండా నీరు మాత్రమే ఉండటం వల్ల ఆమె నేరుగా నీళ్లలో పడిందని, అందువల్ల స్వల్ప గాయాలతోనే ఆమె తప్పించుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె ప్రస్తుతం ఇండోనేషియాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇన్‌సైడ్‌ ఎఫెక్ట్‌ అనే బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా ఆమె పాపులర్‌ అయిన విషయం విదితమే.