బంగారు కొండ ‘మణికొండ’ అందుబాటులో నివాసగృహాలు

House
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్త ప్రభుత్వం రియాల్టీ రంగానికి ఇస్తున్న ఇతోధిక ప్రోత్సాహంతో నగరంలోని ఐటికారిడార్‌తోపాటు శ్రీశైలం హైవే వంటి ప్రాంతాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం అదే కోవలో మణికొండ ప్రాంతం కూడా అద్వితీయ ప్రగతిలో ఉందని సర్వేలు స్పష్టం చేస్తునఆనయి. ఎయిర్‌పోర్టు,రైల్వేస్టేషన్లకు సుళువుగా చేరుకునే అవ కాశం ఉండటం, మెట్రోరైలు రాక వంటివి మణికొండకు మణిదీపంలా పరిణమించాయి. టెలికాం నగర్‌కీలకంగా ఉంది. ఔటర్‌ రింగురోడ్డుకు అతి సమీపంలోనే ఉన్న మణికొండ ప్రస్తుతం నగరంలోని టాప్‌రేగింగ్‌ ఉన్న పది ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. వాస్తవానికి హైదరాబాద్‌లో నివాసిత ప్రాంతాల మార్కెట్లు రానురాను పటి ష్టం అవుతున్నాయి. మణికొండ చెప్పుకోదగి నంతగా వాణిజ్యపరమైన వృద్ధిని సాధించింది. ఐటిహబ్‌గా ఉన్న హెటెక్‌సిటీ, నానక్‌రామ్‌ గూడ, గచ్చిబౌలి, రహేజా ఐటిపార్కు వంటి వాటికి సమీపంలోనే ఉండటంతో మణికొండ అత్యంత అందుబాటులోని నివాసిత ప్రాంతంలో ఐటి వృత్తినిపుణులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఔటర్‌రింగురోడ్డు, ఇందిరాగాంధీ ఫ్లైఓవర్‌కు కేవలం మూడుకిలో మీటర్ల దూరంలోనే ఉంది. ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లకు సులువుగాచేరుకోవచ్చు. పాఠశాలలు, కళాశాల లు, బ్యాంకులు, సూపర్‌మార్కెట్లు, ఆసుపత్రులు, విదనోరంగాలపరంగా మణికొండ మరింతగా వృద్దిని సాధిస్తోంది. మల్టీబిలియన్‌ డాలర్ల ల్యాంకోహిల్స్‌ ప్రాజెక్టు, చిత్రపురికాలనీ వంటివి ఇక్కడ కీలకం. హైటెక్‌సిటీ, గచ్చిబౌలితో పోలిస్తే ఈ రెండు ప్రాజెక్టులు మరింత ఊతం ఇస్తున్నాయి. గచ్చిబౌలి, హైటెక్‌ సిటీల్లో సింగిల్‌బెడ్‌రూమ్‌ ప్రాజెక్టులు అతి తక్కువగా ఉన్నాయి. 2బిహెచ్‌కె, 3బిహెచ్‌కెయూనిట్ల ధరలు 35 లక్షలనుంచి మూడుకోట్లకుపైబడి ఉన్నాయి. అందువల్లనే మణికొండప్రాంతానికి కొనుగోలుదారులు దృష్టిసారిస్తున్నారు. సింగిల్‌ బెడ్‌రూమ్‌, 2బెడ్‌రూం, 3బెడ్‌రూం ప్రాజెక్టులు 20 లక్షల నుంచి ఒక కోటి రూపాయలకుపైబడి ఉన్నట్లు జోన్స్‌లాంగ్‌ లాసెల్టీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ పట్నాయక్‌ వెల్లడించారు. ఐటి ప్రాజెక్టులకు అతిచేరువలో ఉన్నందుననే మణికొండకుప్రాధాన్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.