బంగారం అపహరణ

gold robberygold robbery
gold robbery

హైదరాబాద్: నగరంలోని వేర్వేరు చోట్ల జరిగిన దొంగతనాల్లో మొత్తం 36 తులాల బంగారం అపహరణకు గురైంది. వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లోని తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 30 తులాల బంగారు ఆభరణాలను, రూ. 4 లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయారు. అదేవిధంగా హయత్‌నగర్‌లోని వినాయకనగర్‌లో గల ఓ ఇంట్లో దుండగులు 6 తులాల బంగారం చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.