ఫ్లెమింగో ఫుట్‌బాల్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదం

brazil
brazil

పది మంది మృతి-ముగ్గురికి తీవ్రగాయాలు
రియోడీజెనీరో(బ్రెజిల్‌): బ్రెజిల్‌లోని అత్యంతప్రతిష్టాత్మకమైన, విస్తృత ప్రాచుర్యంలో ఉన్న ఫ్లెమింగో ఫుట్‌బాల్‌క్లబ్‌లో ఎగిసిన అగ్నిప్రమాదం కారణంగా సుమారు పది మంది చనిపోయారు. రియోడిజెనీరోలోని క్లబ్‌ ఆవరణలో జరిగిన ఒక ఆవరణలో జరిగిన ఈప్రమాదంలో యువ క్రీడాకారులు 14నుంచి 17 ఏళ్లలోపు వారు ఉంటున్న భవనంపైపడి పది మంది మృతికి కారణం అయింది. మరోముగ్గురు తీవ్ర గాయాలపాలయినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల అసలు కారణం తెలియరాలేదు. గ్లోబో టివి ఏరియల్‌చేసిన ఫూటేజిని చూస్తే మంటలను రెండుగంటలపాటు పోరాడి అదుపులోనికి తెచ్చినట్లు సమాచారం. ఉదయం ఐదు గంటలకు రియోలోని వర్గెమ్‌ గ్రాండే జిల్లాలోని ఆధునిక కేంద్రంవద్ద ఈ ప్రమాదం జరిగింది. అత్యంత నిపుణులైన ఫ్లెమింగో స్క్వాడ్‌ ఇక్కడ క్రీడాకారులకు శిక్షణ ఇస్తోంది. న్యూస్‌వెబ్‌సైట్‌ జి1 కథనం ప్రకారం ఆరుగురు క్రీడాకారుల్లో నలుగురు టీమ్‌ సిబ్బంది కూడా ఉన్నారని స్పోర్ట్‌ఇవి వెల్లడించింది. ప్రధాన టీమ్‌ ఈ కేంద్రంలో శిక్షణలో ఉంది. యువజన బృందాలు కూడా ఈ కేంద్రంలోనే శిక్షన పొందుతున్నాయి. బ్రెజిల్‌లో ఫుట్‌బాల్‌క్రీడాకారులపరంగా అత్యంతప్రతిష్టాత్మకమైన క్లబ్‌ ఫ్లెమింగో అని చెపుతారు. ఈ శిక్షణా కేంద్రం పశ్చిమరియో ప్రాంతంలో నెలకొని ఉంది. బుధవారం రాత్రి ఒక్కసారిగా తుపానులాంటి గాలులు వీచడంతో భవనంలో లేచిన ప్రమాదంతో భారీ ఎత్తున వ్యాపించాయి. వెనువెంటనే ఆరుగురుచనిపోయారు. భారీ వర్షాల కారణంగా ఈ కేంద్రంలో విద్యుత్‌సరఫరా, మంచినీటిసౌకర్యాలు కూడా బందయ్యాయి. దీనితో లేచిన మంటలను అదుపుచేయడం కూడా కష్టతరం అయింది.