ఫ్లిప్‌కార్ట్‌లో 40శాతం వాటాకు వాల్‌మార్ట్‌ డీల్‌!

walmart, flip kart
walmart, flip kart

ముంబయి: అంతర్జాతీయ వ్యాపారసంస్థ వాల్‌మార్ట్‌ ఇంక్‌ దేశీయంగా అగ్రస్థానంలో ఉన్న ఫ్లిప్‌కార్ట్‌లో 40శాతం వాటా కొనుగోలుకు ముందుకువచ్చింది. ఇందుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. దీనితో అమెజాన్‌కు దేశీయంగా గట్టిపోటీతోపాటు మెగాసవాల్‌ ఎదురవుతుందని నిపుణులు చెపుతున్నారు. అమెజాన్‌ డాట్‌కామ్‌ ఇపుడు దేశంలోనే అతిపెద్ద ఇకామర్స్‌సంస్థగా ఎదిగింది. ఆసియాలోనేమూడో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థ ఉన్న భారత్‌లో ఇపుడిపుడే ఈకామర్స్‌సంస్థలకు భారీ పోటీ ఎదురవుతోంది. విదేశాలకు సంబంధించిన భారీ కొనుగోలుడీల్‌పరంగా చూస్తే అమెరికా రిటైలర్‌ కొత్తకొత్త సంస్థల్లో వాటాలను కొనుగోలుచేయాలని నిర్ణయించింది. భారత్‌ మార్కెట్‌లో తన వాటాను మరింత పెంచుకునేదిశగా కసరత్తులతుముమ్మరంచేసింది. వచ్చే వారిలో ఈ డీల్‌కు సంబంధించి పూర్తి స్పష్టత వస్తుందని అంచనా. అయితే ఇరువైపులా ఇపుడే ఏమీచెప్పలేమన్న సమాధానాలిచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌ విలువలు 12 బిలియన్‌ డాలర్లుగా అంచనావేసారు. జపాన్‌ సాప్ట్‌బ్యాంక్‌గ్రూప్‌ కార్ప్స్‌ విజన్‌ ఫండ్‌నుంచి 2.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించి ఐదోవంతు వాటాలను కొనుగోలుచేసింది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా హెడ్జ్‌ఫండ్‌ టైగర్‌గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌,చైనా టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ ఇబే ఇంక్‌, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌కార్ప్‌ కూడా వీటిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించి అధికారప్రతినిధి మాట్లాడుతూ కంపెనీ ఇలాంటి ఊహాజనితవార్తలపై స్పందించబోదని అన్నారే కానీ ప్రస్తుతం ఈ కొనుగోళ్లపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇక వాల్‌మార్ట్‌ కూడా ఇదే రకమైన సమాధానంతో సరిపెట్టింది.