ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ముంబైః వరుసగా నాలుగో రోజు దేశీయ సూచీలు లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్దిసేపటికే కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, కీలక రంగాల్లో స్వల్ప కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి. మార్కెట్లు ఆద్యంతం ఫ్లాట్‌గా సాగాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 10,800 మార్క్ పైనే స్థిరపడింది.
సెన్సెక్స్ 33.29 పాయింట్లు లాభపడి 35,962.93 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 13.90 పాయింట్లు లాభపడి 10,805.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.81 వద్ద కొనసాగుతోంది.