ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు

This slideshow requires JavaScript.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండో రౌండ్‌లోకి సానియా, డోడిజ్‌ల జంట పురుషుల డబుల్స్‌లో బోపన్న, క్వువస్‌ల జంట మూడో రౌండ్‌లోకి ప్రవేశం డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ పేస్‌ జంటలు ఓటమి పాలు క్లేకోర్టు వీరుడు నాదల్‌, మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ ముగురుజా నాలుగో రౌండ్‌లోకి పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టెన్సిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శుక్రవారం భారత క్రీడాకారిణి సానియా మీర్జా, డోడి జ్‌ల జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ మొదటి రౌండ్‌లో విజ యం సాధించింది.

అన్‌సీడెడ్‌ జూరక్‌, పెవిక్‌ల జంటపై 7-5, 6-3తో వరుస సెట్లలో సునాయాస విజయం నమోదు చేసి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. భారత క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌,స్విట్జర్లాండ్‌ క్రీడాకారిణి మార్టినా హింగీస్‌ల జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలైంది.అదేవిధంగా పురుషుల డబుల్స్‌లో పేస్‌, లిప్స్‌కీల జంట స్పెయిన్‌ క్రీడాకారుల జంట మారెరో, రోబ్రెడ్‌ చేతిలో 7-6(7-3), 6-2తో ఓటమి పాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ నాలుగో ర్యాం కర్ల జంట స్రెబోట్నిక్‌, క్లాసెన్‌ల జంట చేతిలో 6-1, 1-6, 1-0(10-2)తో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌లో 9వర్యాంకర్లు భారత క్రీడాకారుడు రోహన్‌ బోపన్న ఉరుగ్వే క్రీడాకారుడు క్యువస్‌ల జంట మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌ల ఉజెబిస్తాన్‌ క్రీడాకారుడు ఇస్టామిన్‌, పిలిఫ్పిన్స్‌ క్రీడాకారుడు హ్యూ వెల జంటపై 5-7, 7-6(7-4), 6-4తో జయకేతనం ఎగుర వేశారు.

పురుషుల సింగిల్స్‌ క్లేకోర్టు వీరుడు స్పె యిన్‌ నాదల్‌, మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ ముగు రుజా నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మూడో రౌండ్‌లో అన్‌సీడెడ్‌ జార్జియా క్రీడాకారుడు బాసిలా సివ్లిపై 6-0, 6-1, 6-0తో సునాయస విజ యం సాధించగా, ముగురుజా 27వర్యాంకర్‌ కజిగిస్థాన్‌ క్రీడా కారిణిపై 7-5,6-2తో వరుస సెట్లతో విజయం సాధిం చింది.పురుషుల సింగిల్స్‌ కెనడాకు చెందిన 5వ ర్యాంకు క్రీడాకారుడు రావోనిక్‌ నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించారు. స్పెయిన్‌ క్రీడాకారుడు గార్కియా లోపెన ్‌జై 6-1, 1-0తో విజయం సాధించాడు. మహిళల సిం గిల్స్‌లో ప్రాన్స్‌కు చెందిన 13వ ర్యాంక్‌ మ్లాడి నోవిక్‌ అమెరికా క్రీడాకారిణి రోజెర్స్‌పై 7-5, 4-6, 8-6తో సునాయాస విజయంసాధించి నాలుగోరౌండ్‌లోకి ప్రవేశించింది.