ఫ్రెంచి రాజులకు పట్టాభిషేకాల వేదిక నాటర్‌ డాం

         ఫ్రెంచి రాజులకు పట్టాభిషేకాల వేదిక నాటర్‌ డాం

notre-dame church
notre-dame church

ప్రాన్స్‌ దేశానికి పారిస్‌ ముఖ్యపట్టణంగా కొనసాగినా పూర్వకాలం నుండి ఫ్రెంచి రాజులకు పట్టాభిషేకం కొరకు ప్రత్యేకంగా నిర్మించబడిన భవనం. ‘నాటర్‌డాం పారిస్‌ నగరానికి శివార్లలోని ఈ ఆకర్షణీయ భవన సముదాయంలో ప్రాచీన చర్చిభవనం-కెథడ్రిల్‌, సెంట్‌ రెమికి అంకితమైన ‘అచ్చె వాటితోబాటుగల రౌ ప్యాలెస్‌ ముఖ్యమైనవి. క్రీ.శ.13వ శతాబ్దారంభం నుండి నాటర్‌ డాం చర్చి అప్పటి వాస్తు సంపదను పుణికి పుచ్చుకొని నిర్మించబడింది. విశేషమైన శిల్పసంపదను కొత్త వాస్తు కళారీతులతో మేళవించి నిర్మించబడిన నాటర్‌డాం చర్చి భవనం గోథిక్‌ కళకు విశిష్టతకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ కెథడ్రిల్‌లోని అపురూప శిల్పసౌందర్యం, వాస్తు పద్ధతులు ఐరోపాలోని అనేక ఇతర దేశాలలోని చర్చి నిర్మాణాలలో అనుకరించబడ్డాయి.

ప్రధానంగా జర్మనీలో నిర్మించబడ్డ అనేక చర్చి భవనాలు నాటర్‌ డా చేత ప్రభావితమైనాయి. ఫ్రాన్సులో అతిప్రాచీన స్థానికులుగా పేర్కొనబడే ‘ఫ్రాంకుల మొదటి పాలకుడైన క్లోవిస్‌ అనే రాజును క్రైస్థవ మతానికి మార్చిన సెంట్‌ రేమి (క్రీ.శ440-533) అనే మతాధికారి సమాధి ఇక్కడే ఉంది. అది ఇప్పటికీ క్రైస్తవ్ఞలకు యాత్రాస్థలంగా కొనసాగుతోంది. క్రీ.శ.తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ అచ్చె ఫ్రాన్సు దేశంలో గల అతిప్రాచీన చర్చి భవనాలలో ప్రధానమైంది. నాటర్‌ డాంలోగల మరొక ప్రధాన భవనం టీ ప్యాలెస్‌. ఇది అనేక శతా బ్దాల పాటు మత సంబంధమైన ఉత్సవాలకు వేదికగా మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకొంది. కాని ఇది 17వ శతాబ్దంలో పూర్తిగా పునర్నిర్మిమితమై ఎంతో ఆకర్షణీ యంగా రూపొందించ బడింది.

పారిస్‌ నగరంలో ట్యల రీస్‌, లవరి, వర్సేల్‌ వంటి అనేక ప్రతిష్టాకరమైన ప్యాలెస్‌లు వ్ఞన్నా, ఫ్రెంచి రాజుల పట్టాభిషేక మహో త్సవాలన్నీ నాటర్‌ డాంలోని టౌప్యాలెస్‌లో మాత్రమే జరగడం గమనార్హం. ఇంగ్లండులో రాజులు కూడా టవర్‌, వైట్‌హోల్‌, కెన్సింగ్ట్‌న్‌ సెంట్‌జేమ్స్‌ ప్యాలెస్‌, బకింగ్‌హోం ప్యాలెస్‌ వంటి వాటిలో నివాసాలు కొన సాగించినా, దాదాపు గత వేయి సంవత్సరాలుగా పట్టా భిషేక ఉత్సవాలు మాత్రం ‘వెస్ట్‌ మిన్స్టర్‌ ఆచ్చెలోనే ఫ్రాన్సులో వలె కొనసాగుతుంది. నాటర్‌ డాం కెథడ్రిల్‌లో 13వ శతాబ్దంలో కొనసాగిన పునర్నిర్మాణపు క్రమంలో మిక్కిలి ఎత్తైనపై కప్పులు, పెద్దపెద్ద కిటికీలు కల్పించబడి గాలి, వెలుతురుకు మంచి వీలు కల్పించబడింది. కిటికీలకు వెలుతురుకు మిక్కిలి ఆకర్షణీయమైన స్టెయిన్‌ గ్లాసులు అమర్చబడి అందంగా రూపొందించబడ్డాయి. 1804 సంవత్సరం ఫ్రెంచి చక్రవర్తిగా ప్రకటిం చుకొన్న నెపోలియన్‌ బొనపార్టీ (1804-1815) ఈ ప్రతిష్టాకరమైన నాటర్‌డాం కెథడ్రిల్‌లోనే పట్టాభిషేకం చేయించుకొన్నాడు.

పుట్టుకతో రాజుగాకపోయినా, నెపోలియన్‌ ఫ్రెంచి రాజులకు తీసిపోని విధంగా రాచరికాన్ని నెరపగలిగాడు. పట్టాభిషేక సమయంలో ముందెన్నడూ లేనివిధంగా నాటర్‌ డాంను అలంకరింపజేశాడట. ఐరోపాలోనే అత్యం త ఖరీదైన వెల్వెట్‌ వస్త్రాలతో కిటికీలకు పొడుగాటి పరదాలు వేయించాడట. నెపోలియన్‌ కాలంలోని పరదాలు రెండు వందల సంవత్సరాలైనా ఎంతో అందంగా నేటికీ ఉపయోగంలో వ్ఞండడం విశేషం. నెపోలియన్‌తోబాటు అతని భార్య జోసఫిన్‌ కూడా ఫ్రెంచి రాణిగా పట్టాభిషిక్తురాలైంది. ఆమెకు ప్రత్యేకమైన వజ్రకిరీటాన్ని చేయించాడట నెపోలియన్‌.రాజరికం అంతమొంది రిపబ్లిక్‌గా ఏర్పడిన ఫ్రాన్సులో నాటర్‌ డాం చర్చికి మాత్రం ప్రాముఖ్యత కొన సాగుతుంది. టౌప్యాలెస్‌ కేవలం యాత్రికుల సందర్శనానికి ఉద్దేశించబడి వ్ఞంది. ఒకప్పటి ఫ్రెంచి రాజుల సంపన్న జీవనశైలికి సాక్షీభూతం నేటి నాటర్‌ డాం.