ఫ్రాన్స్‌ ఎన్జీవో సంస్థ రఫెల్‌ ఒప్పందంపై ఫిర్యాదు

RAFEL
RAFEL

పారిస్‌: భారత్‌లో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదు చేసింది. ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.. విదేశీ భాగస్వామిగా డసో ఏవియేషన్‌ రిలయన్స్‌ డిఫె‌న్స్‌ను ఎందుకు ఎంచుకుంది.. ఒప్పందంలో ఉన్న నిబంధనలేంటీ.. అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎన్జీవో ఖషెర్పాగ ఫ్రాన్స్‌ ఫైనాన్షియల్‌ ప్రాసిక్యూటర్‌ ఆఫీస్‌లో ఫిర్యాదు నమోదు చేసింది.  ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని, అందుకే ఈ ఫిర్యాదు చేసినట్లు ఎన్జీవో షెర్పా ఓ ప్రకటనలో తెలిపింది. ఖరఫేల్‌ కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్రమోదీ అధికార దుర్వినియోగానికి, లాభార్జనకు పాల్పడినట్లు ఆ దేశ మాజీ మంత్రి ఒకరు ఆరోపణలు చేశారు. దీంతో పాటు ఒప్పందంపై ఫ్రాన్స్‌ వార్తాసంస్థ మీడియాపార్ట్‌ నివేదికను కూడా అధ్యయనం చేసి ఈ ఫిర్యాదు చేశాంగ అని షెర్పా వెల్లడించింది.