ఫ్రంట్‌ ప్రయత్నాలపై మోదీ స్పందన

modi
modi
న్యూఢిల్లీ: కేసీఆర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారన్న విషయమే తెలియదని ప్రధాని మోదీ అన్నారు. మోదీ కోసమే కేసీఆర్‌ ఫ్రంట్ సన్నాహాలు చేస్తున్నారన్న చంద్రబాబు విమర్శలకు మోదీ కౌంటర్ ఇచ్చారు. జాతీయ న్యూస్ ఛానల్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘తెలంగాణపై చంద్రబాబు ద్వేషంతో రాజకీయం చేయాలనుకున్నారు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కంగుతిన్నారు. ఆ ఆక్రోశంతో ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మహాకూటమి అనే మాటకే అర్థం లేదు. ఒక వ్యక్తి లక్ష్యంగా పార్టీలన్నీ ఏకమవుతాయా?. ఇలాంటి. రాజకీయాన్ని జనం తిప్పికొడతారు. ఇది దేశం వర్సెస్‌ మహాకూటమి. తెలంగాణలో మహాకూటమి గతి ఏమైంది. అసలు మహాకూటమిపై చర్చించాల్సిన అవసరం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసమే నాయకులు ఏకమవుతున్నారు. దేశ ప్రజలు బీజేపీతోనే ఉన్నారు. జీవితాంతం కాంగ్రెస్‌ను వ్యతిరేకించినవారు..వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినవారంతా కలిసి మహాకూటమి అంటున్నారు. అలాంటి రాజకీయాలతో లాభం లేదు.’’ అని అన్నారు.