ఫ్యాష‌న్ డిజైనింగ్‌లో ఉచిత శిక్ష‌ణ‌

fashion designing
fashion designing

హైద‌రాబాద్ః మ‌హిళలకు ఉపాధి కల్పనా కోర్సుల ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని, స్వయం ఉపాధి మార్గాలను పెంపొందిస్తున్నట్లు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌, ఫ్యాషన్ సైకాలజిస్ట్‌ విశ్వవినూత్న తెలిపారు. యువిక ఫ్యాషన్ డిజైనింగ్‌ ఇన్ స్టిట్యూట్‌ వాల్‌పోస్టర్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఫ్యాషన్ డి.జైనింగ్‌లో ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ఆరునెలలపాటు నిర్వహించనున్న విశ్వవినూత్నను రమణాచారి అభినందించారు. కార్యక్రమంలో మెజీషియన్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కా పు వెంకటరమణ, క్రియేటివ్‌ డిజైనర్‌ అశోక్‌ డి తదితరులు పాల్గొన్నారు.