ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌!

VAMSI111
Vamsi

ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌!

 

సరిగ్గా 32 సంవత్సరాల క్రితం వంశీ దర్శకత్వంలో రూపొంది ఎన్నో సంచలనాలు సృష్టించిన లేడీస్‌ టైలర్‌ సినిమాకి సీక్వెల్‌ గా మళ్ళీ వంశీ దర్శకత్వంలో ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ రూపొందుతున్నది. అప్పటి లేడీస్‌ టైలర్‌ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా రాజోలు పరిసర ప్రాంతాల్లో, పాపికొండల్లోని గోదావరి తీరాల్లో నిర్విరామంగా 62 రోజుల పాటు షూటింగ్‌ పూర్తి చేసుకొని ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస హిమవర్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన ఐదు అధ్బుతమైన పాటలను వంశీ తండైన శైలిలో ఎంతో అందంగా చిత్రీకరించారని, కడుపుబ్బ నవ్వించే కామెడీతో వంశీ సినిమాల అభిమానులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ==