ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో శ్రీదేవి పార్థీవ దేహం

SRIDEVI 33
Sridevi

అతిలోకసుందరిగా కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి పార్థీవ దేహాన్ని కొన్ని గంటలుగా దుబా§్‌ు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లోనే ఉంది. ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. మరో గంటసేపు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. దుబా§్‌ులో ముహైస్నాలో శ్రీదేవి పార్థీవ దేహానికి ఎంబామింగ్‌ చేస్తున్నారు. తదనంతరం పోలీసులు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా పార్థీవ దేహాన్ని అప్పగిస్తారు. అంబానీలకు చెందిన ఓ ప్రైవేటు విమానంలో శ్రీదేవి పార్థీవ దేహాన్ని బారత్‌కు తరలిస్తారు. సాయంత్రం 5.30గంటల అనంతరం ఈ విమానం బయలుదేరే అవకాశం ఉంది.