ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడితే చట్టరీత్యా నేరం: టెలికాం మంత్రి మనోజ్‌

 

Manoj sinha
Manoj sinha

దిల్లీ: దేశంలో ఉన్న కోట్లాది ఫోన్‌లకు వచ్చే వాట్సాప్‌, ఇతర సందేశాలను పర్యవేక్షించడం సాధ్యం కాదని
కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. టెలికాం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా మాట్లాడుతూ… అధికారికంగా ఏర్పాటు
చేసిన లా ఎన్‌ఫోర్‌మెంట్‌ ఏజెన్సీలకు కూడా చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర
ప్రభుత్వం కేంద్రీకృత సమీక్ష వ్యవస్థ (సీఎమ్‌ఎస్‌)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఆయన రాజ్యసభలో
శుక్రవారం తెలిపారు. చట్టవిరుద్ధంగా ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడితే టెలీగ్రాఫ్‌ చట్టంలోని 25,26 సెక్షన్ల
ప్రకారం నేరమౌతుందన్నారు. అలాగే చట్టవిరుద్ధంగా ఆటంకాలు సృష్టించే వాళ్లకు శిక్షతో పాటు జరిమానా
విధించే అవకాశం ఉందన్నారు.