ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే సబ్బు డెలివరి

AMAZON
AMAZON

న్యూఢిల్లీ: ఒక వినియోగదారుడు ఇ-కామర్స్‌ సైట్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేశారు. అయితే, దానికి బదులుగా ఒక సబ్బు వచ్చిందని, అమెజాన్‌ హెడ్‌, మరో ముగ్గురి మీద పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.గ్రేటర్‌ నోయిడా లోని బిస్రాఖ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేశారని తెలిపారు. కాగా ఇలాంటి మోసపూరితమైన సంఘటనలు జరగడం పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు,ఈ విషయాలపై పోలీసులకు సహకరిస్తున్నట్లు కంపెనీ సమాధానమిచ్చింది.ఈ సంఘటన బిస్రాఖ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిందన్నారు. ఫిర్యాదుదారుడి కథనం ప్రకారం తాను అమెజాన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఒక మొబైల్‌ ఫోన్‌ ను ఆర్డర్‌ చేసినట్లు తెలిపారు. కాగా అది అక్టోబరు 27 న పార్శిల్‌ డెలివరీ అయ్యిందని, ఆ పార్శిల్‌ ను విప్పి చూడగా ఫోన్‌ కు బదులుగా సబ్బు కనిపించిందని బాధితుడు వాపోయాడని, స్టేషన్‌ సర్కిల్‌ ఆఫీసర్‌ నిశాంక్‌ శర్మ పేర్కొన్నారు. బాధితుడు చేసిన ఫిర్యాదు పై అమెజాన్‌ కంట్రీ హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌, దర్శిత లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్స్‌ ప్రదీప్‌ కుమార్‌, రవీశ్‌ అగర్వాల్‌, డెలివరీ బా§్‌ు అనిల్‌ పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు పోలీసుటు తెలిపారు. వారిపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్స్‌ 420, 406, 120బి,నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కంపెనీ ని సంప్రదించగా, ఆ ఘటనను ధృవీకరించినట్లు, ఆయనకు తిరిగి ఫోన్‌ను పంపిస్తారని తెలిపారు. కాగా భారత్‌ లో నమ్మకమైన ఆన్‌లైన్‌ పోర్టల్‌ గా అమెజాన్‌ కు పేరుంది. తాము ఈ సంఘటనలను కఠినంగా తీసుకుంటున్నామన్నారు. సంబంధిత కేసు గ్రేటర్‌ నోయిడా లోని బిస్రాఖ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో నమోదయ్యింది. పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారని, వారికి పూర్తి సహకారాన్ని,కావలసిన సమాచారాన్ని అందిస్తామని పేర్కొన్నారు.