ఫైలట్‌ లేకపోవడంతో అలస్యంగా బయలుదేరిన విమానం!

AIR INDIA
AIR INDIA

ముంబై: ముంబాయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ రోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన ఎయిర్‌
ఇండియా విమానం దాదాపు ఏడు గంటల పాటు టెకాఫ్‌ కాలేదు. దీనికి కారణం ఫైలెట్‌ లేకపోవడం. దీంతో అందులో వెళాల్సిన 200మంది
ప్రయాణికులు అందోళనకు దిగారు. విమానం అలస్యం అయినందుకు తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, అహారం కూడా ఇవ్వలేదని
అన్నారు. విమానం గంట అలస్యంగా బయలుదేరుతుందని చెప్పారని, అ తరువాత ఫైలట్‌ లేడని చెప్పారని ప్రయాణికులు మండిపడ్డారు. చివరకు
ఉదయం 9గంటల సమయంలో ఫైలట్‌ రావడంతో విమానం బయలుదేరింది.